YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తాటి చెట్టు పక్కన ఆగి కల్లు తాగిన సీపీఐ నేత నారాయణ !

 తాటి చెట్టు పక్కన ఆగి కల్లు తాగిన  సీపీఐ నేత నారాయణ !

సైకిల్పై అమరావతిలో చక్కర్లు.

హఠాత్తుగా సచివాలయానికి వచ్చిన నారాయణ

రాజధానిని నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానిదే 

సీపీఐ జాతీయ నేత నారాయణ ఏపీ రాజధాని అమరావతిలో సైకిల్ పై చక్కర్లు కొట్టారు. గురువారం  ఉదయం 7 గంటలకే ఆయన సచివాలయానికి వచ్చారు. హఠాత్తుగా ఆయన రావడంతో భద్రతా సిబ్బంది ఉలిక్కి పడ్డారు. సచివాలయం చూడ్డానికి వచ్చానని, తనను లోపలకు పంపాలని సిబ్బందిని కోరగా... ఈ సమయంలో ఎవరూ లేరంటూ ఆయను చెప్పారు సిబ్బంది. దీంతో, సచివాలయం లాన్ లోనే కాసేపు విశ్రాంతి తీసుకున్నారాయన. ఈ సందర్భంగా ఎన్టీఆర్ క్యాంటీన్ ను సందర్శించారు. అనంతరం రోడ్డు పక్కన ఉన్న ఓ తాటి చెట్టు వద్ద ఆగి, కల్లు రుచి చూశారు. ఈ సందర్భంగా మీడియాతో నారాయణ మాట్లాడారు.దీర్ఘకాలిక ఆలోచనలతో రోడ్లను వేస్తున్నారని చెప్పారు. బాబు ఆలోచనలు బాగా ఉన్నప్పటికీ... ఆచరణలో పూర్తి స్థాయిలో సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

కేసులకు భయపడి..

 చంద్రబాబు, జగన్ లు కేసులకు భయపడి మోదీని ఏమీ అనలేక పోతున్నారని.. భయపడి, బతిమిలాడితే నిధులు రావని నారాయణ చెప్పారు. జైలుకు వెళ్తే ఏమవుతుందని... ఆ తర్వాత హీరోలవుతారని అన్నారు. ఇప్పుడు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను జైల్లో పెట్టారని... 2019లో బీహార్ లో ఆయన సత్తా ఏంటో చూపిస్తారని తెలిపారు. మోదీ సత్తా ఏంటో మొన్నటి తమిళనాడు ఆర్కేనగర్ ఉప ఎన్నికలో తేలిపోయిందని ఎద్దేవా చేశారు. నోటా కంటే తక్కువ ఓట్లు రావడంతో బీజేపీ ఇరకాటంలో పడిపోయిందని అన్నారు. ఇకనైనా చంద్రబాబు తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు.

మోదీ  మొండి చేయి..

 ప్రధాని నరేంద్ర మోదీ పైకి నవ్వులు చిందిస్తూ, నిధుల విషయంలో మొండి చేయి చూపిస్తున్నారని విమర్శించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధానిని నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత కూడా కేంద్రానిదే అని అన్నారు.

.

Related Posts