YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఒక్క రోజులో నాలుగున్నర అడుగుల ఎత్తు పెరిగిన గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతున్న ఉద్ధృతి

ఒక్క రోజులో నాలుగున్నర అడుగుల ఎత్తు పెరిగిన గోదావరి నీటిమట్టం  అంతకంతకూ పెరుగుతున్న ఉద్ధృతి
మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు గోదావరి నదిలో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. భద్రాచలం వద్ద నిన్న 26 అడుగులుగా నమోదైన నీటిమట్టం, ఈ ఉదయం 30.6 అడుగులకు చేరింది. వర్షాలు ఇంకా కురుస్తూనే ఉండటంతో నేటి సాయంత్రానికి నీటిమట్టం మరింతగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల పనులను వరద నీటి కారణంగా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో చిన్న చిన్న చెరువులు కూడా నిండుతున్నాయి. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ లో నీటి నిల్వ 8 టీఎంసీలకు చేరింది. తాలిపేరుకు భారీగా వరద వస్తుండటంతో నాలుగు గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు పరిస్థితీ ఇదే. వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా, దాదాపు 80 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. నిన్నమొన్నటి వరకూ ఇసుక తెన్నెలతో ఎడారిలా కనిపించిన గోదారమ్మ ఇప్పుడు జలకళ సంతరించుకుంది.

Related Posts