YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లోకేష్ చేతిలో చంద్రబాబు కీలుబొమ్మగా మారనున్నడా!

లోకేష్ చేతిలో చంద్రబాబు కీలుబొమ్మగా మారనున్నడా!
లోకేష్ చేతిలో చంద్రబాబు కీలుబొమ్మగా మారనున్నడా!అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.;తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో లేని వేళ ఆయన కేబినెట్ లోని జూనియర్ మంత్రి  ఒకరు కీలక ప్రకటన చేశారు. కర్నూలు జిల్లాలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆ మంత్రి అక్కడ పార్టీ తరఫున ఎమ్మెల్యే - ఎంపీ అభ్యర్థులెవరో ప్రకటించేశారు. నిజానికి ఇంత ముందుగా అభ్యర్థులను ప్రకటించడం టీడీపీ సంప్రదాయం కాదుఅ.. పైగా చంద్రబాబు అయితే తాను ఫిక్సయినా కూడా చివరి నిమిషం వరకు వెల్లడించరు. లాంటిది కేబినెట్ లోని ఒక జూనియర్ మంత్రి ఏకంగా కీలకమైన జిల్లాలో పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తే ఏమనుకోవాలి.. దాన్ని చంద్రబాబును పక్కనపెట్టడం - తీసిపడేయడం గానే భావించాలి.. మామూలుగా అయితే ఆ పని చేసినందుకు నేరుగానో.. పరోక్షంగా చర్యలుంటాయి. కానీ.. ఆ ప్రకటన చేసిన జూనియర్ మంత్రి చంద్రబాబు తనయుడే కావడంతో అది తప్పు కాలేదు. కానీ... ప్రజలకు ఇతర పార్టీలకు మాత్రం ఒక స్పష్టమైన సంకేతం వెళ్లిపోయింది. అదేంటంటే... టీడీపీలో ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి చంద్రబాబు అనుమతే అవసరం లేదు.. అంతేకాదు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ గెలిచినా చంద్రబాబు సీఎం కాదు అని సంకేతాలు వెళ్లిపోయాయి. లోకేశ్ తన చర్యలతో ఈ సిగ్నల్ ఇచ్చారు.అసలే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరైన కర్నూలులో ఇలా హఠాత్తుగా అభ్యర్థులను ప్రకటించడాన్ని టీడీపీ నేతలు కూడా తప్పుపడుతున్నారు. చంద్రబాబయితే పార్టీలో అసంతృప్తులన్నీ సద్దుమణిగేలా చేసి.. పరిస్థితి అనుకూలంగా మార్చి అప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తారని. కానీ లోకేశ్ ఇలా అభ్యర్థులను ప్రకటించేయడం వల్ల పార్టీలో అసంతృప్తుల నుంచి సహకారం అందదని,  ఇది గెలుపుని దెబ్బతీస్తుందని అంటున్నారు. మరోవైపు ఇలా చంద్రబాబుతో సంబంధం లేకుండా లోకేశే టిక్కెట్లు ఇచ్చుకుంటూ పోయి మొత్తంగా తన అనుకూల వర్గాన్ని తయారుచేసుకుని తానే సీఎం కావాలని అనుకుంటున్నారన్న వాదనా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఒక వేళ టీడీపీ గెలిస్తే లోకేశ్ ను సీఎం చేయాలన్న డిమాండు పెరుగుతుందని అంటున్నారు. మరి చంద్రబాబు కొడుకు చేతిలో కీలుబొమ్మగా మారుతారో లేదంటే... అనుభవం లేని లోకేశ్ చేతిలో పడి టీడీపీ ఇంకా దెబ్బతినకుండా కాపాడుకుంటారో చూడాలి.

Related Posts