కరువు నేల పై కేంద్రం వివక్షతపై అనంతపురం లో టీడీపీ ఎంపీ లు చేపట్టిన ధీక్షలో పాల్గొన్న మంత్రులు పరిటాల సునీతా, కాలువ శ్రీనివాసులు తో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,శాసన మండలి విప్ పయ్యావుల కేశవ్, విప్ యామిని బాల, ఎమ్మెల్సీ లు శమంతకమణి, గుండుమల, ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి, కనక మేడల రవీంద్ర, సీఎం రమేష్, తోటా నరసింహులు, నిమ్మల కిష్టప్ప, రామ్మోహన్ నాయుడు, అవంతి శ్రీనివాస్, రవీంద్ర ,కొనకళ్ల నారాయణ, మురళీమోహన్, గల్లా జయదేవ్ , బుట్టా రేణుకా,ఎమ్మెల్యే లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, అత్తార్ చాంద్ బాష, మేయర్ స్వరూపా, జెడ్పి చైర్మన్ పూలనాగరాజు, మాజీ సైఫుల్లా , వడ్డెర్ల చైర్మన్ దేవర్ల మురళి, టీడీపీ నేతలు జేసీ పవన్ కుమార్ రెడ్డి, పరిటాల శ్రీరామ్, డైరెక్టర్లు రాయల్ మురళి, ఈసీ వెంకటేష్,అల్లాబక్ష్ తదితరులు పాల్గొన్నారు. ఛీఫ్ విప్ డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు రాకుండా అడ్డుకున్నది బీజేపీ ప్రభుత్వమే. బూందేల్ ఖండ్ తరహా ప్యాకేజి ఇస్తామని కేంద్రం మాట తప్పిందని ఆరోపిచారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ కి వెళ్లి విభజన సమస్యలు తీర్చాలని మోడీకి, మంత్రులకు విన్నవించినా,కేంద్రానికి కనీసం కనికరం లేదు. తిరుపతి లో ఏపీ కి మోడీ ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు. తెలుగు ప్రజల కు మోసం చేస్తే కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వానికైనా గత కాంగ్రెస్ కు పట్టిన గతే మోడీ ప్రభుత్వానికి పడుతుంది. ఏపీకి విభజన హామీలు నెరవేర్చకుండా పోతే తెలుగు ప్రజల దెబ్బ తో బీజేపీ కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. కేంద్రం ఏపీ కి పచ్చి మోసం ,దగా చేసిందని అన్నారు. ఏపీ హక్కుల కోసం పోరాడుతున్న టీడీపీ ఎంపీ లకు జిల్లా ప్రజల తరపున అభినందనలు తెలియజేసారు. వైసీపి అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కు ప్రజల పై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ను విమర్శించే స్థాయి జగన్, పవన్ కు లేదని అన్నారు.