పేదవాడు రెండుపూటలా కడుపునిండా భోజనం చేయాలనే ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రంలో నేడు 100 అన్నా కేంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఐదు రూపాయలకే భోజనం, టిఫిన్ పేదలకు నిరంతరం అందిస్తామని ఏలూరు యంపి మాగంటి బాబు చెప్పారు. స్ధానిక స్టేట్ బ్యాంక్ వద్ద బుధవారం అన్నా కేంటీన్‌ను ఏలూరు మేయరు షేక్ నూర్జహాన్ ప్రారంభించారు. ఈసందర్భంగా మాగంటి బాబు మాట్లాడుతూ సమాజంలో ప్రతీ నిరుపేదా ఆకలితో బాధపడకూడదని ఎ ంగిలి విస్తరాకులకు ఎ గపడకుండా ఉండాలనే ఉద్ధేశ్యంతో ఐదు రూపాయలకే ఉదయం పూట టిఫిన్, ఐదురూపాయలకే మధ్యాహ్నం, రాత్రి భోజన సౌకర్యాన్ని అన్నాకేంటీన్‌లో అందరికీ అందిస్తామని మాగంటి బాబు చెప్పారు. పేద ప్రజల సంక్షేమంకోసం ఎ న్నో పధకాలను ప్రవేశ##పెట్టి చంద్రబాబు భవిష్యత్తులో ఏఒక్క పేదకుటుంబం ఆకలితో అలమటించకూడదనే ఉద్ధేశ్యంతో అన్నాకేంటీన్‌లను అడుగడుగునా ఏర్పాటు చేస్తామని చెప్పారని మాగంటి బాబు చెప్పారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి బుజ్జి మాట్లాడుతూ 27 రూపాయలు ఖరీదు చేసే పౌష్టికాహారాన్ని పేదలకు ఐదు రూపాయలకే అందించి ప్రభుత్వం బాధ్యతగా పేదల ఆకలి తీరుస్తుందని రెక్కాడితేగానీ డొక్కాడని ఎ ంతోమంది కార్మిక, కర్షక, చేతివృత్తి పనివారలు షాపుల్లో గుమస్తాలు, ఇతర పేదవర్గాలు ఈఅన్నాకేంటీన్‌లు వినియోగించుకుని పౌష్టికంగా తయారు కావాలని ఆయన చెప్పారు. ప్రతీరోజూ ఇడ్లీతోపాటు పూరి, పొంగల్, ఉప్మా రోజువారీ మారతాయని అదేవిధంగా మధ్యాహ్నం, రాత్రి అన్నం, కూర, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడితో ఖచ్చితంగా పోషకవిలువలతోకూడిన ఆహారాన్ని అన్నా కేంటీన్‌లో సరఫరా చేయడం జరుగుతుందని బడేటి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎ న్ని ఆర్ధిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమంకోసం క్రొత్త పథకాలు అమలు చేసి పేదరిక నిర్మూలనే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని బుజ్జి చెప్పారు. రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి మండలి ఛైర్మన్ అంబికా కృష్ణ మాట్లాడుతూ అక్షయపాత్ర అనే సంస్ధకు అన్నాకేంటీన్ నిర్వాహణా బాధ్యతలను ప్రభుత్వం అప్పగించిందని నాణ్యమైన ఆహారాన్ని పేదలకు అందించి తీరతామని చెప్పారు. ఏరోజున ఏకేంటీన్‌లో ఎ ంతమంది టిఫిన్లు, భోజనాలు చేసారో క్షణాలలో చంద్రబాబు కు చేరే పరిస్ధితి ఉన్నదని డిమాండ్‌ను బట్టి ఇక్కడ అవసరమైతే భోజనాలు మరింత ఎ క్కువు మందికి అందిస్తామని ఇది నిరంతరం సాగుతుందని అంబికా కృష్ణ చెప్పారు. మేయరు షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ పేదవర్గాలు భోజనం లేదనే మాట వినపడకూడదని కేవలం ఐదు రూపాయలకే టిఫిన్, భోజనం అందించే అన్నాకేంటీన్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎ ఎ ంసి ఛైర్మన్ శ్రీ పూజారి నిరంజన్, రాష్ట్ర హస్త కళల అభివృద్ధి సంస్ధ ఛైర్మన్ పాలి ప్రసాద్, కార్పోరేషన్ కమిషనరు మోహనరావు, కార్పోరేటర్ బండారు కిరణ్‌కుమార్, విప్ గూడవల్లి శ్రీనివాస్, కార్పోరేటర్లు బౌరోతు బాలాజీ, ప్రతాప్, రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు