ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేర్లు దూసుకెళ్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ఫలితాలను టీసీఎస్ మంగళవారం వెల్లడించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ అంచనాలకు మించి లాభాలను నమోదు చేసింది. ఏకీకృత నికర లాభం 23.4శాతం పెరిగి రూ. 7,340కోట్లుగా నమోదైంది. ఇక కంపెనీ ఆదాయం 15.8శాతం వృద్ధితో రూ. 34,261కోట్లకు పెరిగింది.