YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

త్వరలోనే నిరుద్యోగ యువతకు భృతి అమలు మంత్రి కొల్లు రవీంద్ర

త్వరలోనే నిరుద్యోగ యువతకు భృతి అమలు                         మంత్రి కొల్లు రవీంద్ర
రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో అప్రెంటిస్ షిప్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రారంభించింది. విశాఖపట్నంలో బుధవారం నొవాటెల్ హోటల్ లో‘ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అప్రెంటిస్ షిప్ స్కీమ్ ఇన్ ఏపీ’పేరుతో ఒక రోజు సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నైపుణ్యాభివృద్ధి,న్యాయ, యువజన, క్రీడలు, ఎన్నారై ప్రయోజనాల శాఖ మంత్రి కొల్లు రవీంద్రతోపాటు ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి, సీఈవో కె.సాంబశివరావు, ఎల్వీ సుబ్రహ్మణ్యం(స్పెషల్ చీఫ్ సెక్రెటరీ యూత్ అఫైర్స్), జెఎస్వీ ప్రసాద్(రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ) రాజేష్ అగర్వాల్(జాయింట్ సెక్రెటరీ, డిపార్ట్ మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్ షిప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా)తోపాటు ఎపిఎస్‌ఎస్‌డిసి డైరెక్టర్డాక్టర్ కె. లక్ష్మినారాయణ, సీఐఐ ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షులు,మాపెల్ సాఫ్ట్ వేర్ సంస్థ సీఈవో జి.శివకుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా‘నేషనల్ అప్రెంటిస్ షిప్ ప్రమోషన్ స్కీమ్‘ బ్రోచర్ ను మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. ఈ సదస్సుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పరిశ్రమల ప్రతినిధులు, ట్రైనింగ్ పార్ట్ నర్స్ హాజరయ్యారు. ఈ సందర్బంగామంత్రి మాట్లాడుతూ అప్రెంటిస్ షిప్ విధానంపై పరిశ్రమల్లో ఉన్న అపోహలను తొలగించేందుకే రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఒక రోజు అవగాహనా సదస్సు ఏర్పాటు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్రంలో 2లక్షల వరకు వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయని వాటిలో మెజారిటీ పరిశ్రమలు అప్రెంటిస్ షిప్ విధానాన్ని అమలు చేయడం లేదని మంత్రి అన్నారు. ఇప్పటికే కేంద్రం అప్రెంటిస్ షిప్ విధానంలో ఎన్నో సవరణలు చేసిందని మంత్రి చెప్పారు. ఏదైనా పరిశ్రమ అప్రెంటిస్ ద్వారా ఒక వ్యక్తికి శిక్షణ ఇస్తే.. అతనికి ఇచ్చిన స్టెఫండ్ లో 25శాతాన్ని ప్రభుత్వం కంపెనీకి తిరిగి చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే నిరుద్యోగ భృతిని అమలు చేయబోతోందని, ఇప్పటి వరకు 22 నుంచి 35ఏళ్ల వయస్సున్న నిరుద్యోగులు 10 లక్షల మందికి ఉన్నట్టు గుర్తించామన్నారు. వారందికీ నిరుద్యోగ భృతి ఇవ్వడమే కాకుండా వారందరికీ అప్రెంటిస్ షిప్ తో అనుసంధానించాలన్న ఆలోచనలో ఉన్నామని మంత్రి తెలిపారు. అంతే కాకుండా ఆక్వా, అగ్రి, హార్టికల్చర్ తోపాటు హాస్పటాలిటీ, రీటైల్, అపెరల్, లాజిస్టిక్ రంగాల్లో కూడా భారీగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని యువతకు ఈ తరహా శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు లాంటి సమర్థవంతమైన నేత ఉండడం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని చెప్పారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగానే ఎపిఎస్ఎస్ డిసి యువతలో నైపుణ్యాలు పెంచడానికి ఎన్నో శిక్షణా కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి చెప్పారు. ఇప్పటికైనా అప్రెంటిస్ షిప్ విధానాన్ని అమలు చేయడానికి అన్ని రకాల పరిశ్రమలు ముందుకు రావాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.అంతకుముందు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి, సీఈవో కె సాంబశివరావు మాట్లాడుతూ అప్రెంటిస్ షిప్ ను అమలు చేసే విషయంలో పరిశ్రమలకు ఎన్నో అపోహలున్నాయని, వాటిని తొలగించేందుకే వివిధ పరిశ్రమలు, ట్రైనింగ్ పార్ట్ నర్స్ తో ఈ సదస్సు ఏర్పాటు చేశామన్నారు. నేషనల్ అప్రెంటిస్ షిప్ ప్రమోషన్ స్కీమ్ ను మరింత సులువగా అమలు చేయడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ స్కీమ్ ప్రస్తుతం ఐటీఐ, తయారీ రంగాలకే పరిమితం అయి ఉందని.. దాన్ని సర్వీస్ సెక్టార్స్ లోనూ దీన్ని అమలు చేయాలని నిర్ణయించామన్నారు. అప్రెంటిస్ షిప్ అనేది ఉద్యోగం కాదని, భవిష్యత్తులో ఉద్యోగం పొందడానికి ఒక మార్గంగా ఉపయోగపడుతుందని సాంబశివరావు అన్నారు. దీన్ని అమలు చేయడానికి పరిశ్రమలంతా సహకరించాలని ఆయన సూచించారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా అప్రెంటిస్ షిప్ విధానాన్ని అమలు చేయడానికి ముందుకు రావడం ఆనందంగా ఉందని డిపార్ట్ మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్ షిప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాజాయింట్ సెక్రెటరీ రాజేష్ అగర్వాల్ అన్నారు. అప్రెంటిస్ షిప్ విధానం యువతతోపాటు పరిశ్రమలకు కూడా ఉపయోగకరమని అన్నారు. జర్మనీలో అప్రెంటిస్ విధానం విజయవంతంగా అమలు అవుతోందని, మన దేశంలో మాత్రం ఇప్పటికీ ముందుకు రావడం లేదన్నారు. ఈ స్కీమ్ అమలు కోసం కేంద్రం 10వేల కోట్లు కేటాయించిందని.. ఇప్పటి వరకు కేవలం 200 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగామని రాజేష్ అగర్వాల్ అన్నారు. పరిశ్రమల్లో ఉన్న అపోహలు తొలగించడం జరుగుతోందని, అప్రెంటిస్ షిప్ ను అమలు చేయడానికి కేంద్రం ప్రత్యేకంగా ఒక పోర్టల్ రూపొందించిందని ఇందులో పరిశ్రమలు, అప్రెంటిస్ షిప్ పొందాలనుకునే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. దేశంలో 83శాతం మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు రావడం లేదని అలాంటి వారందరికీ అప్రెంటిస్ షిప్ ను వర్తింపజేసి సర్వీస్ సెక్టార్ ద్వారా ఉపాధి పొందవచ్చని సూచించారు.అప్రెంటిస్ షిప్ ద్వారా యువతకు ఆర్థికంగా కొంత వెసులుబాటుతోపాటు నైపుణ్యం పొందే అవకాశం కలుగుతుందని స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఫర్ స్కిల్ డెవలప్ మెంట్ ఎంట్రప్రెన్యూర్ షిప్ ఇన్నొవేషన్ జెఎస్వీ ప్రసాద్ అన్నారు. నేషన్ అప్రెంటిస్ షిప్ ప్రమోషన్ స్కీమ్ ను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. దాంతోపాటు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను కూడా దీనికి పరిధిలోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్టు ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఎపిఎస్ఎస్ డిసి) ద్వారా దాదాపు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలలో సాఫ్ట్ స్కిల్స్ తోపాటు అనేక రకాల నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. అంతేకాకుండా ఆధునిక టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ ఇచ్చేందుకు సీమెన్స్, డస్సాల్ట్, గూగుల్ లాంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని జెఎస్వీ ప్రసాద్ తెలిపారు.అప్రెంటిస్ షిప్ విధానం అమలులో ఉన్న అపోహలను ఇప్పటికైనా తొలగించాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని స్పెషల్ చీఫ్ సెక్రెటరీ యూత్ అఫైర్స్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిరుద్యోగ భృతిని అమలు చేయబోతోందని, అప్రెంటిస్ షిప్ విధానాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేయడానికి పరిశ్రమలు సహకరించాలని ఆయన కోరారు.రెండో సెషన్ లో భాగంగా మధ్యాహ్నం వివిధ పరిశ్రమల ప్రతినిధులు, ట్రైనింగ్ పార్ట్ నర్స్ తో కలిసి చర్చా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అప్రెంటిస్ షిప్ అమలులో పరిశ్రమల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పలువురు నిపుణులు సమాధానాలు ఇచ్చారు.అప్రెంటిస్ షిప్ విధానం ఇప్పటివరకు కేవలం ఐటీఐలు, తయారీ రంగం పరిశ్రమల్లో మాత్రమే అమలవుతోంది. దీంతో 1961లో ఉన్న అప్రెంటీస్ షిప్ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సవరణలు చేసింది. ఈ చట్ట సవరణ ప్రకారం అప్రెంటిస్ షిప్ విధానాన్ని అన్ని రంగాల్లోనూ అమలు చేయాలని కేంద్రం నిర్ణయించి 2016 ఆగస్టులో నేషనల్ అప్రెంటిస్ షిప్ ప్రమోషన్ స్కీమ్ ను ప్రారంభించింది. ఆ మార్గదర్శకాల ప్రకారం వ్యక్తులకు అప్రెంటిస్ షిప్ శిక్షణ ఇచ్చిన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క అభ్యర్థికి 1500 రూపాయల చొప్పున స్టైఫండ్ రూపంలో చెల్లించనుంది. 2020 నాటికి ఈ అప్రెంటిష్ షిప్ శిక్షణ ద్వారా 50లక్షల మంది నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.జాతీయస్థాయిలో అప్రెంటిస్ షిప్ విధానాన్ని నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్(ఎన్ఎస్‌డిసి),రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ(ఎపిఎస్‌ఎస్‌డిసి) కలిసి అమలు చేయనున్నాయి. అందులో భాగంగా ఈ అప్రెంటీస్ షిప్ విధానంలో షార్ట్ టర్మ్ కోర్సులను రీటైల్, అపెరల్, లాజిస్టిక్, హాస్పటాలిటీ ఇలా అన్ని రంగాల్లో అమలు చేయబోతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అప్రెంటీస్ షిప్ శిక్షణలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను భాగస్వాములను చేసి వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన కసరత్తు చేస్తోంది.  

Related Posts