YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

బాలయ్య... నీ మార్క్ ఏదయ్యా

బాలయ్య... నీ మార్క్ ఏదయ్యా
ఎమ్మెల్యే...బాలకృష్ణ ప్రత్యేక మార్క్ ఏ పథకాలపైనా లేదు. తనదైన శైలిలో పట్టణాభివృద్ధికి మూడు పథకాలను అమలు చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయి నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అయితే వాటి అమలుకు ప్రభుత్వం ఏకంగా రూ.200 కోట్లు కేటాయించాల్సి ఉంది. నిధుల విడుదలకు పరిపాలనాపరమైన అనుమతులు వచ్చినా నిధుల విడుదల మాత్రం ఇప్పటి దాకా జరగలేదుఎమ్మెల్యే బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు ప్రధానమైన పథకాలకు సంబంధించి ప్రభుత్వ నిధుల మంజూరు కోసం ఎదురచూపులు తప్పడం లేదు. బాలకృష్ణ నాలుగేళ్ల హయాంలో ఇప్పటి దాకా చిన్నాచితక పథకాలు గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పథకాలు మాత్రమే పూర్తయ్యాయి. పట్టణానికి గొల్లపల్లి నుంచి తాగునీటిని తీసుకొచ్చే రూ.194 కోట్ల పథకం పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 75 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నుండి రూ.56 కోట్లు అమృత్ నిధులు మంజూరయ్యాయి. మిగిలిన సొమ్మును ప్రభుత్వం, మున్సిపాలిటీ భరించాల్సి ఉంది. మున్సిపాలిటీ నిధులు భరించే పరిస్థితి లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సొమ్మును మినహాయించి మిగిలిన నిధులను రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటి దాకా కేంద్ర ప్రభుత్వ నిధులు, మున్సిపాలిటీకి వచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధులు మాత్రమే బిల్లుల కింద గుత్తేదారుకు చెల్లించారు. మిగిలిన నిధుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో ముఖ్య పథకమైన రూ.66 కోట్లతో పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఇప్పటి దాకా నిధులు మంజూరు కాలేదు. నిధుల మంజూరుకు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదే విషయమై తానే స్వయంగా దస్త్రాలను తీసుకొని సచివాలయంలో తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే ఇప్పటి దాకా నిధుల విడుదల కొలిక్కి రాలేదు. పట్టణంలో దశాబ్ధాల కాలంగా నూతన మార్కెట్ నిర్మాణం అనే కల బాలకృష్ణ హయాంలో నెరవేరడానికి అవకాశం ఉంది. అయితే ఇది పూర్తిస్థాయి నిధుల విడుదలతోనే సాధ్యమవుతుంది. మార్కెట్‌ను రూ.23 కోట్లతో నిర్మించేందుకు పనులు సాగుతున్నాయి. నిర్మాణ పనులను గుత్తేదారు ప్రారంభించారు. మార్కెట్ నిర్మాణానికి రూ.10 కోట్లు ప్రభుత్వం మరో రూ.10 కోట్లు వ్యాపారుల నుండి వస్తాయని భావిస్తున్నారు. మరో రూ.3 కోట్లను మున్సిపాలిటీ భరించాల్సి ఉంది. అయితే ఇప్పటి దాకా ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులు మంజూరు చేయకపోవడం, వ్యాపారుల నుండి రూ.10 కోట్లు వచ్చే అవకాశం లేకపోవడం, ప్రస్తుత పరిస్థితుల్లో మున్సిపాలిటీ రూ.3 కోట్లను కేటాయించే అవకాశం కనిపించకపోవడంతో నిధుల్లో ప్రధాన భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నింటిని లెక్కగడితే దాదాపు రూ.200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మరో ఆరు నెలల్లో విడుదల చేస్తేనే బాలకృష్ణ మార్క్ అభివృద్ధి సాధ్యమవుతుంది. లేదంటే ప్రతిపక్ష పార్టీ విమర్శలకు గురి కావాల్సి ఉంటుంది. అంతిమంగా ప్రజల అసంతృప్తికి దారి తీసే అవకాశం ఉంటుంది.

Related Posts