'అబ్ తక్ చప్పన్' చిత్రానికి రచయితగా పనిచేసిన రవి శంకర్ అలోక్ (32) ముంబైలోని ఓ బహుళ అంతస్తుల భవంతిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం రాత్రి 2 గంటల సమయంలో తన భవంతి పై అంతస్తుకు చేరుకున్న ఆయన, అక్కడి నుంచి దూకాడు. అతని వద్ద, అతని ఇంట్లో ఏ విధమైన సూసైడ్ నోట్ దొరకలేదు. ఆయన ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని, సైకియాట్రిక్ చికిత్స తీసుకుంటున్నాడని పోలీసులు వెల్లడించారు.