- దేశంలోని అన్ని సినీ పరిశ్రమల ధోరణి
- మహిళలతో బాలీవుడ్ బంధం..?
నో సెక్స్ ప్లీజ్. మేం బాలీవుడ్ వాళ్లం.కానీ మా దగ్గరకి రండి.. మా పాటల్లో, డాన్సుల్లో అణిగిపోయిన పొత్తి కడుపులు, ఉబికివచ్చే అందాల్ని మీకు ఇబ్బంది కలగని రీతిలో అందిస్తాం. ఇక నిరుత్సాహపూరిత కథానాయికలను అప్రాధాన్యపాత్రల్లో ప్రవేశపెడతాం.బాలీవుడ్‌లో మహిళల చిత్రీకరణ గురించి ఎప్పుడు ఎలాంటి సంభాషణ జరిగినా కళ్ల ముందు కదలాడే దృశ్యాలివి.
నిజానికి ఒక్క బాలీవుడ్ మాత్రమే కాదు: కథానాయికను ఒక అలంకార వస్తువుగా చేయటం భారతదేశంలోని అన్ని పెద్ద సినీ పరిశ్రమల్లోనూ ప్రధానాంశమైపోయింది. సినిమాలో హీరో ఉన్నట్లయితే అతడు ముందు వరుసలో ఉంటాడు. హీరోయిన్ ముఖ్య విధి అతడిని పూజించటం, ఆరాధించటం.. హీరోలు బయటకు వచ్చినపుడు అడ్డు తప్పుకోవటం.
ఇది ఎల్లవేళలా ఇలాగే ఉండేది కాదు.
హాలీవుడ్‌లో నిరుటి ధీర వనితల తరహాలోనే ఒకప్పుడు బాలీవుడ్‌లోనూ ధైర్యంగా నిలబడిన హీరోయిన్లు ఉన్నారు. అవి సినిమా తొలి రోజులు. కులం, వర్గం వంటి నిషిద్ధ అంశాలను విశ్లేషించటానికి సినీ నిర్మాతలు సినిమాలను పనిముట్టుగా వాడుకుంటున్న కాలమది.
కానీ సామాజిక అవగాహన గల 1950ల తర్వాత పరిస్థితులు మారాయి. 1960ల్లో, ఆ తర్వాతా సినిమా ప్రధాన కొలమానం వినోదం... పురుష పాత్రలే కీలకంగా మారి, స్త్రీ పాత్రలు ద్వితీయ శ్రేణి పౌరులకు దిగజారాయి.