జులై 21న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్నుల హేతుబద్ధీకరణలో భాగంగా ఒక విషయంపై చర్చించే అవకాశం ఉంది. అది ఏమిటిఅంటే తక్కువ ఆదాయం కలిగించే వస్తువులపై జీఎస్టీ తగ్గించాలని భావిస్తున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ భావిస్తోంది. చేతి వృత్తుల ద్వారా వచ్చే ఉత్పత్తులు, చేనేత ఉత్పత్తులతో పాటు పలు వస్తువులపై జీఎస్టీ తగ్గించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చేనేత, శానిటరీ న్యాప్‌కిన్స్ తదితర వస్తువులపై ప్రస్తుతం 12శాతం జీఎస్టీ ఉంది. అయితే వీటిపై పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణిలోకి తీసుకోనుందని ఓ అధికారి వెల్లడించారు.