వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది.వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దాళ్వా పంటకు పూర్తి స్థాయిలో నీరు అందించేలా చర్యలు తీసుకుంటానని జగన్ అన్నారు. అలాగే తొలకరిలో వరి పంట దిగుబడులు బాగానే ఉన్నప్పటికీ మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆరుగాలం కష్టించి పంటలు పండించే పంటలకు సరైన మద్దతు ధర ప్రకటించి న్యాయం చేయాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తక్కువగా ఉంటున్నారంటే సరైన విద్యనుఅందించలేకపోవడమేనన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం తక్కువగా ఉన్నాయన్నారు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు, విద్య వ్యవస్థలపై తగిన చర్యలు తీసుకుని ఆదుకోవాలని జగన్కు విజ్ఞప్తి చేశారు.అన్ని వర్గాలూ మేము సైతం అంటూ ప్రజా సంకల్పయాత్రలో మమేకమయ్యాయి.కమ్మని పలకరింపులు, అవ్వాతాతల ఆశీర్వాదాలు, అశేష జన స్వాగతాలు, ముస్లిం సోదరుల ఆత్మీయ ఆలింగనాలతో 210వ రోజు పాదయాత్ర ఆద్యంతం జోరుగా.. హుషారుగా సాగింది. మండపేట నియోజకవర్గం రాయవరంలో ప్రారంభమైన పాదయాత్ర బిక్కవోలు మండలం కొమరిపాలెంలో అడుగు పెడుతూ అనపర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఇక్కడ నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు ఘనస్వాగతం పలికారు. జననేతను స్వాగతిస్తూ రహదారిపై పూలబాట వేశారు. తొస్సిపూడి క్రాస్, పందలపాక మీదుగా ఊలపల్లి పాకలు వరకు 6.3 కిలోమీటర్లు కొనసాగింది. దీంతో 2,522.8 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసినట్టు అయ్యింది.