YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

సిమ్ లేకుండా మొబైల్

సిమ్ లేకుండా మొబైల్
ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్..దేశంలో తొలిసారిగా ఇంటర్నెట్ టెలిఫోనీ సేవలను ఆరంభించింది. ఈ నెల 25 నుంచి అందుబాటులోకి రానున్న ఈ సేవల కింద సిమ్ లేకుండానే మొబైల్ యాప్ ద్వారా దేశంలోని ఏ టెలిఫోన్ నంబర్‌కైనా కాల్ చేసుకోవచ్చును. వింగ్స్ పేరుతో విడుదల చేసిన ఈ మొబైల్ యాప్ ద్వారా అన్‌లిమిటెడ్‌గా మాట్లాడుకోవచ్చును. ఇందుకోసం వార్షిక ఫీజు కింద రూ.1,099 చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ సేవలు లేదా వై-ఫై ద్వారా ఏ టెలికం ఆపరేటర్, ఏ ఫోన్ నంబర్‌కైనా కాల్ చేసుకోవచ్చునని తెలిపింది. ప్రస్తుతం టెలికం రంగంలో నెలకొన్న పోటీ వాతావరణంలో బీఎస్‌ఎన్‌ఎల్ మార్కెట్ వాటాను పెంచుకోవడం మెచ్చుకోదగినది.. సిమ్ లేకుండా వినియోగదారులకు ఇంటర్నెట్ టెలిఫోనీ ద్వారా కాల్ చేసుకునే అవకాశం కల్పించడం మంచి పరిణామమని ఈ నూతన సేవలను ఆరంభించిన తర్వాత టెలికం మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. వచ్చే కొద్ది రోజుల్లో రిజిస్ట్రేషన్లను ప్రారంభించి, ఈ నెల 25 నుంచి పూర్తి స్థాయిలో సేవలను ఆరంభించనున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. ఈ వింగ్స్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా భారత్‌కు చెందిన ఏ నెట్‌వర్క్‌కైనా కాల్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఐడియా-వొడాఫోన్ విలీనంపై మంత్రి మాట్లాడుతూ..ఈ విలీనానికి ఇప్పటికే అన్ని అనుమతులు లభించాయని, కొన్ని లాంచనాలు మాత్రమే మిగిలాయని చెప్పారు. 

Related Posts