- మళ్లీ పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు పట్ట పగ్గాలు లేకుండా పెరుగుతున్నాయి. గురువారం(ఫిబ్రవరి 1) పెట్రోల్ లీటరుపై 13 పైసలు, డీజిల్ లీటరుపై 11 పైసలు పెరిగింది. ఉదయం 6 గంటల నుంచి ఈ పెంచిన ధరలు అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా ప్రతి రోజూ పెట్రో ధరలను సవరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు అనుమతి ఇవ్వడం తెలిసిందే. ఈ మేరకు ప్రతి రోజూ ఆయిల్ కంపెనీలు ధరలను సవరిస్తున్నాయి.
గురువారం ప్రధాన నగరాల్లో నాన్-బ్రాండెడ్ పెట్రోల్ ధర ఈ విధంగా ఉంది.
హైదరాబాద్- రూ.77.36
న్యూఢిల్లీ- రూ.73.05
కొల్‌కత్తా- రూ.73.74
ముంబై- రూ.80.91
చెన్నై- రూ.73.05
గురువారం ప్రధాన నగరాల్లో నాన్-బ్రాండెడ్ డీజిల్ ధర ఈ విధంగా ఉంది.
హైదరాబాద్- రూ.69.65
న్యూఢిల్లీ- రూ.64.11
కొల్‌కత్తా- రూ.66.78
ముంబై- రూ.68.27
చెన్నై- రూ.67.62