సినిమా: చినబాబు
సంస్థ: 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్, ద్వారకా క్రియేషన్స్
నటీనటులు: కార్తీ, సాయేషా, ప్రియా భవాని శంకర్, సత్య రాజ్, భానుప్రియ, సూరి, శంకర్, ఆర్థన బిను.
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : పాండిరాజ్
నిర్మాతలు: సూర్య, మిరియాల రవీందర్ రెడ్డి
సహా నిర్మాతలు: సి.హెచ్. సాయి కుమార్ రెడ్డి, రాజశేఖర్ కర్పూర, సుందర పాండియాన్.
సంగీతం: డి.ఇమాన్
కెమెరామెన్: వేల్ రాజ్
ఎడిటింగ్: రూబన్
`చినబాబు` అనే టైటిల్ తెలుగువారికి కొత్తకాదు. కానీ ఇప్పుడు కార్తి నటించడమే కొత్త. ఆ మధ్య నాగార్జునతో `ఊపిరి` సినిమాలో నటించిన కార్తి , నాగ్ నటించిన `చినబాబు` టైటిల్‌నే ఇప్పుడు తన సినిమాకు పెట్టుకున్నారు. ఇప్పటిదాకా కార్తి నటించిన ఏ చిత్రంలోనూ కంప్లీట్ ఫ్యామిలీ కనిపించదు. అయితే ఈ సినిమాలో ఫ్రేమ్ నిండుగా కుటుంబ సభ్యులున్నారు. తొలిసారి ఫుల్ ప్లెడ్జ్ డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటించారు కార్తి. ఈ సినిమా ఆయనకు ఎలాంటి చిత్రమవుతుంది? ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ చేస్తుందా? తమిళ సంప్రదాయాలు తెలుగు నేటివిటీకి సరిపోయాయా? వంటివి తెలుసుకోవాలంటే ఆలస్యమెందుకు.. చదివేయండి..
కథ:
రుద్రరాజు (సత్యరాజు) కుమారుడు కృష్ణంరాజు (కార్తీ). రుద్రరాజుకు ఐదుగురు అమ్మాయిల తర్వాత పుట్టిన మగపిల్లాడు. అందుకే గారాబంగా పెరుగుతాడు. గారాబంగా పెరిగినంత మాత్రాన బాధ్యతల్ని మర్చిపోయి విచ్చలవిడిగా బతకలేదు. పదో తరగతి వరకు చదువుకుని ఆర్గానిక్ వ్యవసాయం చేస్తుంటాడు. నెలకి రూ.లక్షన్నర పైగా సంపాదిస్తుంటాడు. అతనికి ఇద్దరు మేనకోడళ్లుంటారు. వాళ్లిద్దరిలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటారని అంతా అనుకుంటుంటారు. అయితే అతను నీలనీరద (సాయేషా)ను ప్రేమిస్తాడు. నీరదకు సొంతంగా సోడా కంపెనీ కూడా ఉంటుంది. అయినా సింపుల్‌గా ఉండాలన్నది ఆమె సిద్ధాంతం. ఆమె బావ సురేందర్ రాజు (శత్రు) కులం ఓట్లతో నెగ్గాలనుకుంటుంటాడు. తన తమ్ముడికి నీరదను ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో తన అక్కలను, బావలను ఒప్పించి కృష్ణంరాజు ఎలా నీరద మెడలో మూడు ముళ్లు వేశాడు? దఆనికి ఎవరెవరు అడ్డుపడ్డారు? ఎవరెవరు సాయం చేశారు అనేది ఆసక్తికరమైన మిగిలిన చిత్రం.
ప్లస్ పాయింట్లు
- కుటుంబ కథ
- నటీనటుల నటన
- కామెడీ
- రైతును గొప్పగా చెప్పిన తీరు
మైనస్ పాయింట్లు
- కొన్ని చోట్ల ఎమోషన్ సరిగా పండలేదు
- సత్యరాజ్ కి డబ్బింగ్ చెప్పిన గొంతు సూటవలేదు
- తెలుగు నేటివిటీకి కాస్త దూరంగా ఉంది
- కొన్ని చోట్ల తెలుగు బోర్డులు, కొన్ని చోట్ల తమిళ అక్షరాలు చూపించడం..
రేటింగ్: 3/5