YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రుణ ప్రణాళిక విడుదల చేసిన సీఎం చంద్రబాబు

రుణ ప్రణాళిక విడుదల చేసిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళిక (2018-19) విడుదల చేశారు. మొత్తం 1,94,220 కోట్ల రూపాయిలతో రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను ఆయన విడుదల చేశారు. ప్రాధాన్యతా రంగానికి 1,44,220 కోట్ల రూపాయిలు, ప్రాధాన్యేతర రంగానికి 50,000 కోట్ల రూపాయిలు, భారీ పరిశ్రమలు 10, 457 కోట్ల రూపాయిలు, ఎంఎస్ఎంఈ 3745 రూపాయిలు, మైక్రో ఎంటర్ప్రైజెస్ 14,028 రూపాయిలు, స్మాల్ ఎంటర్ప్రైజెస్ 11500 కోట్ల రూపాయిలు, మీడియం ఎంటర్ప్రైజెస్ 2733 కోట్ల రూపాయిలు, మొత్తం ఎంఎస్ఎంఇ రుణాలు 28261 కోట్ల రూపాయిలు కేటాయించినట్లు చంద్రబాబు చెప్పారు. అలాగే, వ్యవసాయ రుణ ప్రణాళిక రూ.1,01,564 కోట్లు,  స్వల్పకాలిక ఉత్పాదక రుణాలు రూ. రూ.75,000 కోట్లు, వీటిలో కౌలు రైతులకు ఆర్ధిక సాయం రూ.7,500 కోట్లు, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు రుణాలు రూ.21,323 కోట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాలు రూ.241 కోట్లు, అనుబంధ కార్యక్రమాలకు రూ. 5,000 కోట్లు  మొత్తం: వ్యవసాయ రుణాలు : రూ 1,01,564 కోట్లు కేటాయించారు. చంద్రబాబు మాట్లాడుతూ ప్రజల్లో బ్యాంకులు నమ్మకాన్ని నిలపాలని... వారిని మోసం చేసేందుకు ప్రయత్నించవద్దని చెప్పారు. బ్యాంకుల్లో చేసే డిపాజిట్లపై ప్రజల్లో తీవ్ర ఆందోళన ఉందని, పెద్ద ఎత్తున అపోహలు ప్రచారంలో ఉన్నాయని తెలిపారు. నోట్ల రద్దు తర్వాత ఇప్పటికీ నగదు కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఉపాధి కూలీలకు డబ్బు చెల్లించడం కూడా కష్టమవుతోందని అన్నారు. 

Related Posts