కాంగ్రెస్ కుటుంబంలోకి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది. కాంగ్రెస్ వల్లే మా కుటుంబం ఈ స్థాయిలో ఉంది. మా నాన్న మంత్రి అయ్యారు. నేను స్పీకర్ అ తరువాత సీఎం అయ్యానంటే దానికి కారణం కాంగ్రెస్ అని మాజీ ముఖ్యమత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి మా కుటుంబం చాలా దగ్గర. శుక్రవారం నాడు అయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరిన సందర్బంగా అయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ నాయకత్వాన్ని బలోపేతం చేస్తాం. తానందుకే కాంగ్రెస్ లో చేరాన్నారు. పార్టీని వీడి వెళ్లిన వారందర్నీ మళ్లీ సొంత గూటికి తీసుకువస్తానని చెప్పారు. కాంగ్రెస్తో తన అనుబంధం విడదీయరానిదని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే ఆంధ్ర, తెలంగాణకు న్యాయం జరుగుతుందని అయన అన్నారు. విభజన చట్టం అమలు చేయడం లో అన్ని పార్టీలు విఫలమయ్యాయి. కాంగ్రెస్ మాత్రమే న్యాయం చేయగలదు. స్పెషల్ స్టేటస్, పోలవరం, రైల్వే జోన్, జాతీయ విద్య సంస్థలు రావాలంటే కేంద్రం లో కాంగ్రెస్ రావాలని అయన అన్నారు. ఆంధ్రాలో కాంగ్రెస్ కి చాలా మంచి భవిష్యత్తు ఉందని అన్నారు.
విభజన చట్టం రాజ్యసభలో ఆమోదం పొందే సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారన్నారు. ప్రధాన మంత్రి సభలో చెప్పిన మాట చట్టంతో సమానమని ఆయన అన్నారు. రాజ్యసభలో ప్రధాని ఇచ్చిన హామీనే బీజేపీ అమలు చేయడం లేదని విమర్శించారు. గత ప్రధాని ఇచ్చిన హామీను నెరవేర్చాల్సిన బాధ్యత ఇప్పటి ప్రధానికి ఉంటుందన్నారు. రాహుల్ గాంధీ తనకు ఏ బాధ్యతలు అప్పగిస్తే వాటిని నెరవేరుస్తానని అన్నారు. మా సోదరుని తెలుగుదేశంలోకి వెళ్ళొద్దని చెప్పాను. అయినా వెళ్లారు. అది ఆయన ఇష్టమని అన్నారు.