జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. పది రోజుల క్రితం వైద్యులను సంప్రదించగా.. ఎడమ కంటిలో కురుపు అయిందని దానికి శస్త్ర చికిత్స చేయడమే మార్గమని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో బుధవారం అయన ఎల్వీప్రసాద్ ఆస్పత్రిలో కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు.వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేసి గురువారం ఆయనను డిశ్చార్జి చేశారు. పవన్ని కొద్దిరోజులపాటు విశ్రాంతి తీసుకోవలసిందిగా వైద్యులు సూచించారు