YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

2018 - 19 దేశ వార్షిక బ‌డ్జెట్ - ముఖ్యాంశాలు

2018 - 19 దేశ వార్షిక బ‌డ్జెట్ - ముఖ్యాంశాలు

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పార్ల‌మెంట్‌లో  దేశ బడ్జెట్ ను పార్ల‌మెంట్‌లో ఆర్థిక‌శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్ర‌వేశ‌పెట్టిన‌ దేశ బడ్జెట్ ముఖ్యాంశాలు..

గవర్నర్ల వేతనాలు పెంపు. రాష్ట్రపతి గౌరవ వేతనం రూ.5లక్షలు. ఉపరాష్ట్రపతి గౌరవ వేతనం రూ.4లక్షలు, గవర్నర్ల గౌరవ వేతనం రూ.3.5లక్షలు.

ప్రతి వ్యాపార సంస్థకు యూనిక్‌ ఐడీ. సులభతర వాణిజ్యంలో పారదర్శకత కోసం ప్రతి వ్యాపార సంస్థకు గుర్తింపు.స్టాంప్‌ డ్యూటీల విధానం నుంచి బయట పడేందుకు రాష్ట్రాలతో సంప్రదింపులు. స్టాంప్‌ డ్యూటీల విషయంలో కొత్త విధానంపెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.80వేల కోట్లు.

కృత్రిమ మేధో రంగంలో పరిశోధనలు.క్రిప్టో కరెన్సీని ప్రభుత్వం అంగీకరించదు.14 ప్రభుత్వ రంగ సంస్థలను స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్‌ చేస్తాం.

భారత్‌ నెట్‌వర్క్‌ కార్యక్రమం కోసం రూ.10వేల కోట్లు. గ్రామాల్లో 5లక్షల వైఫై రూటర్ల సదుపాయం.900 కొత్త విమానాల కొనుగోలు. వంద కోట్ల ప్రయాణాలకు వీలుగా విమానాశ్రయాలు విస్తరణ.టోల్‌ ప్లాజాలో సులభతర ప్రయాణానికి వీలుగా ఎలక్ట్రానిక్‌ చెల్లింపులు.

2020 నాటికి 50లక్షల మంది యువతకు ఉద్యోగ నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ.క్రియాశీలకంగా లేని 56 విమానాశ్రయాలు ఉడాన్‌ పథకం కింద అభివృద్ధి.జీవన ప్రమాణాల మెరుగుదలకు పైలట్‌ ప్రాజెక్టు కింద 115 జిల్లాల ఎంపిక.

3600 కి.మీ. మేర రైల్వేలైన్ల పునరుద్ధరణ. 600 రైల్వే స్టేషన్ల అభివృద్ధి.అన్ని రైల్వే జోన్‌లు, రైళ్లలో సీసీటీవీలు, వైఫై సౌకర్యం. పెరంబూర్‌లో అధునాతన కోచ్‌ల నిర్మాణం.రవాణా రంగ కారిడార్ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ.రైల్వేల్లో 18 వేల కి.మీ. డబ్లింగ్‌. రైలు పట్టాల నిర్వహణకు పెద్ద పీట. 4వేలకు పైగా కాపలాదారులు లేని గేట్ల తొలగింపు.

ఇంటింటి తాగునీటి పథకానికి రూ.77,500కోట్లు.రోడ్లు, మౌలిక వసతులకు రూ.9.64లక్షల కోట్లు.

రైల్వేలకు రూ.1.48లక్షల కోట్లు.ఆకర్షణీయ నగరాల పథకం కింద 99 నగరాల ఎంపిక వాటి అభివృద్ధికి రూ.2.04లక్షల కోట్లు.

నమామి గంగ పథకం కింద 187 ప్రాజెక్టులు. 10 పర్యాటక కేంద్రాల అభివృద్ధి. పురావస్తుశాఖ కింద ఉన్న 110 కేంద్రాల అభివృద్ధికి కృషి.కొత్త ఉద్యోగాలు కల్పించే రంగాల్లో ప్రభుత్వం చెల్లించే ఈపీఎఫ్‌ 8.33శాతం నుంచి 12శాతానికి పెంపు. పెంచిన ఈపీఎఫ్‌ మూడేళ్ల పాటు అమలు.

సరిహద్దుల్లో మౌలిక సౌకర్యాలకు ప్రాధాన్యత.గత మూడు సంవత్సరాల్లో ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత.వస్త్రపరిశ్రమ కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు.

టెక్స్‌టైల్‌ రంగానికి రూ.7,140కోట్లు.ముద్ర యోజన కింద చిన్న పరిశ్రమలకు రుణాలు ఇచ్చే యోచన. రుణాల్లో 75శాతం మహిళలకు కేటాయింపుపీఎం జీవన్‌ బీమా యోజన ద్వారా రెండు కోట్ల కుటుంబాలకు లబ్ధి.జన్‌ధన్‌ యోజనలో భాగంగా 60వేల కోట్ల బ్యాంకు ఖాతాలకు బీమా సౌకర్యం వర్తింపు.

దళిత సంక్షేమానికి కోసం రూ.56వేల కోట్లు.

ఆదివాసీల సంక్షేమానికి రూ.32,508కోట్లు.

చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమల కోసం రూ.3,790కోట్లు.ఆరోగ్య రంగానికి 1.38లక్షల కోట్లు.

గ్రామీణ పారిశుద్ధ్య పథకానికి రూ.16,713కోట్లు.

ప్రధాని సౌభాగ్య పథకంలో భాగంగా నాలుగు కోట్ల గృహాలకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు. సౌభాగ్య పథకానికి రూ.16వేల కోట్లు.

అన్ని పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర.

ప్రతీ పౌరునికి సమీపంలో వెల్‌నెస్‌ సెంటర్లు. వాటి ఏర్పాటుకు రూ.1200కోట్లు.మహిళా స్వయం సహాయక బృందాలకు రూ.75వేల కోట్లు.

క్షయ రోగుల సంక్షేమం కోసం రూ.600కోట్లు.

మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఒక కళాశాల ఏర్పాటు. 24 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రులురూ.330 ప్రీమియం చెల్లింపుతో 10 కోట్ల పేద కుటుంబాలకు రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా. దీనివల్ల 50 కోట్లమంది వినియోగదారులకు లబ్ధి.విద్యారంగంలో మౌలిక సౌకర్యాలకు రూ.లక్ష కోట్లు.

2017 జాతీయ ఆరోగ్య పథకంలో భాగంగా ఆయుష్మాన్‌ భారత్‌. ఆరోగ్య కేంద్రాలకు రూ.1200కోట్లు.

ఆదివాసీ బాలలకు ఏకలవ్య పాఠశాలలు. వడోదరలో రైల్వే విశ్వవిద్యాలయం.బ్లాక్‌బోర్డు నుంచి డిజిటల్‌ బోర్డు: కార్యక్రమంలో భాగంగా డిజిటల్‌ విద్యా కేంద్రాలు.వ్యవసాయ రుణాలకు రూ.11లక్షల కోట్లు.జాతీయ జీవనోపాధి కార్యక్రమానికి రూ.5,750కోట్లు

గృహ నిర్మాణానికి ప్రత్యేక గృహనిర్మాణ నిధి. దేశవ్యాప్తంగా 55లక్షల గృహాల నిర్మాణానికి చర్యలు.ప్రధానమంత్రి గ్రామసడక్‌ యోజనతో మరిన్ని గ్రామీణ రోడ్ల అనుసంధానం.2022 నాటికి అన్ని గ్రామాల్లో పక్కా రోడ్ల నిర్మాణంఉజ్వల యోజనలో భాగంగా 8కోట్లమంది గ్రామీణ మహిళలకు గ్యాస్‌ కనెక్షన్లు.దిల్లీలో కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలుమత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖలకు రూ.10,000కోట్లు.

జాతీయ వెదురు పరిశ్రమల కోసం రూ.1,290కోట్ల కేటాయింపు.కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను ఇక నుంచి చేపలు, పశు పెంపకం దారులకు విస్తరిస్తాం.42 మెగాఫుడ్‌ పార్కులను పటిష్టం చేస్తాం. ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లకు రూ.1400కోట్లు.

ఆపరేషన్‌ గ్రీన్‌ కోసం రూ.500కోట్లు.పర్‌ఫ్యూమ్స్‌, ఆయిల్స్‌ కోసం రూ.200కోట్లు.

గ్రామీణ వ్యవసాయ మార్కెట్లకు రూ.2000కోట్లు. సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం.వ్యవసాయం దేశంలో ప్రధాన రంగం. క్లస్టర్‌ విధానంలో భాగంగా వ్యవసాయాభివృద్ధికి చర్యలు. హార్టీకల్చర్‌కు ప్రాధాన్యం.ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 15శాతం పెరుగుతాయి.రాజకీయాలతో ప్రమేయం లేకుండా పనిచేస్తున్నాం. వ్యవసాయం, మౌలిక సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం.2022కు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలన్న ఆశయంతో ఉన్నాం. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు వేస్తున్నాం.డీబీటీ విజయవంతమైంది. లబ్ధిదారునికి వీలుగా రాయితీలు అందుతున్నాయి.సహజ వనరులను పారదర్శక విధానంలో కేటాయిస్తున్నాం. నిజమైన లబ్ధిదారులకు సబ్సిడీలు అందిస్తున్నాం.సులభతర వాణిజ్యం విధానంలో ఆర్థికవృద్ధి వేగంగా జరుగుతుంది.

సంస్థాగ‌త సంస్క‌ర‌ణ‌ల్లో పేద‌ల‌కు ల‌బ్ధి. ఈ సంస్క‌ర‌ణ‌ల‌తో బ‌లీయ‌మైన ఆర్థికశ‌క్తిగా భార‌త్‌.ప్రపంచంలో ఏడో ఆర్థికశక్తిగా ఎదిగాం. త్వరలోనే ఐదో ఆర్థిక‌శ‌క్తిగా భార‌త్ అవతరించనుంది.7.2-7.5 జీడీపీ ఎదుగుద‌ల ఉంటుంది.ప‌న్నుల విధానం జీఎస్‌టీలో సుల‌భ‌త‌ర‌మైంది. పెద్ద‌నోట్ల ర‌ద్దులో భారీగా ధ‌నం వినియోగంలోకి వ‌చ్చిందిగ‌త నాలుగేళ్ల‌లో తీసుకొన్న చ‌ర్య‌ల ఫ‌లితంగా ఎఫ్‌డీఐ(విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబడులు పెరిగాయి.

Related Posts