కోహ్లీ మరో రికార్డును అందుకున్నాడు. అదేంటంటే... ఒక క్యాలెండర్ ఇయర్‌లో వెయ్యి పరుగులు సాధించడం. కోహ్లీ ఇలా ఒక క్యాలెండర్ ఇయర్‌లో వెయ్యి పరుగులు సాధించడం వరుసగా ఇది తొమ్మిదోసారి. ఈ ఏడాది ఇప్పటికే కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో వెయ్యి పరుగుల మార్కును అందుకున్నాడు. టెస్టు, వన్డే, టీ20.. మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లీ ఒకే క్యాలెండర్ ఇయర్‌లో వెయ్యి పరుగులు సాధించడం ఇది తొమ్మిదోసారి. గురువారం భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే ద్వారా కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 82 బంతుల్లో 75 పరుగులు చేశాడు.