వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా
9.5 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. భూమి నుండి ఎత్తుకు వెళ్లే కొద్దీ ఇది నైఋతి వైపుకు తిరిగింది. రాగల 24 గంటల్లో అల్పపీడనం తీవ్రఅల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఉత్తర చత్తీస్ గఢ్ దాని పరిసర ప్రాంతాలలో 1.5 కిమీఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణ లో ఆదిలాబాద్, నిర్మల్, కోమరంభీం, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, జైశంకర్ భూపాలపల్లి, మెహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది
ఆదిలాబాద్, నిర్మల్, కోమరంభీం, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, జైశంకర్ భూపాలపల్లి, మెహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి, మెదక్, రాజన్నసిరిసిల్ల, జనగామ, సూర్యాపేట, నల్గొండ, మరియు యాదాద్రి భువనగిరి జిల్లాలలో ఒకటి రెండు చోట్ల అతిభారీ వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రేపు తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఆదిలాబాద్, నిర్మల్, కోమరంభీం, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, జైశంకర్ భూపాలపల్లి, మెహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట మరియు నల్గొండ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
కోస్తా ఆంధ్ర లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రాగల మూడురోజులు కోస్తా ఆంధ్రలో చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది రాయలసీమలో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు రాయలసీమలో ఈరోజు, రేపు చాలాచోట్ల, ఎల్లుండి కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది
.