కాంగ్రెస్ పార్టీకి గుజరాత్‌లో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా కుమారుడు మహేంద్రసింగ్ శనివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీతూ వాఘానీ ఈ విషయాన్ని వెల్లడించారు. మహేంద్రసింగ్ వాఘేలా 2007, 2012లో రెండుసార్లు కాంగ్రెస్ టికెట్‌పై అసెంబ్లీకి ఎన్నికయ్యారు.బీజేపీలో చేరిన వెంటనే మహేంద్రసింగ్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. పురాతన పార్టీకి పునర్జీవం తేవాలన్న ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయత్నాలు ఫలించబోవన్నారు. ఆ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు.