YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తెలుగు రాష్ట్రాల ప్రస్తావనేది జైట్లే

  తెలుగు రాష్ట్రాల  ప్రస్తావనేది జైట్లే

-  ఏపీకి మళ్లీ  జైట్లీ మొండి చెయ్యి..

-  విశాఖ రైల్వే జోన్  హామీ ఏమైంది..

-  అమరావతి, పోలవరం ఊసు లేదు..

- కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం  చేస్తున్న  తెలుగు ప్రజలు

విభజన నేపథ్యంలో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం ఏమాత్రం సానుకూలత ప్రదర్శించలేదని ఈ బడ్జెట్‌లో తేలిపోయిందని అంటున్నారు. ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెడితే.. ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్, అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు నిధులపై ఆశించినట్లుగా లేదని అంటున్నారు. బడ్జెట్‌లో అమరావతి, పోలవరం ఊసు కనిపించలేదు. ఇది తెలుగుదేశం పార్టీకి ఊహించని పరిణామమే అంటున్నారు. ఇప్పటికే ఏపీలో బీజేపీ - టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. 2019కి కలిసి ఉంటారా విడిపోతారా అనే చర్చ ఇప్పటికే సాగుతోంది

బడ్జెట్‌ ప్రసంగంలో ఎక్కడా తెలుగు రాష్ట్రాల పేర్లు వినిపించలేదు. తెలుగు ప్రజలు సోషల్ మీడియాలో కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే విషయంలో తెలుగు రాష్ట్రాల పేర్లు ప్రస్తావించని జైట్లీ.. బెంగళూరు మెట్రోకు 17వేల కోట్లు, ముంబై సబర్బన్ రైల్వేకు 17వేల కోట్లు కేటాయించడం గమనార్హం. అన్ని రైళ్లలోనూ, రైల్వే స్టేషన్లలోనూ ఉచిత వైఫై సేవలు అందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ చెప్పారు.ఇలాంటి పరిస్థితుల్లో జైట్లీ బడ్జెట్ ఏపీకి ఊరటనివ్వలేదు. దీంతో చంద్రబాబు ఊహించని నిర్ణయం ఏమైనా తీసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఇటీవల మరోసారి ప్రతిపాదనల కోసం కేంద్రం ఏపీని అడిగింది. దీంతో ఏపీ ఆశలు పెట్టుకుంది. కానీ ఆ ఆశలు ఫలించలేదు.

ఏపీకి ఇవి వచ్చాయి. డ్రెడ్జింగ్ కార్పోరేషన్‌కు రూ.19.62 కోట్లు. విశాఖ పోర్టుకు రూ.108 కోట్లు. ఏపీలో ఐఐపీఈకి రూ.32 కోట్లు. ఐఐఎస్సీఆర్‌కు రూ.49 కోట్లు. ఐఐటీకి రూ.50 కోట్లు. గిరిజన వర్సిటీకి రూ.10 కోట్లు. ఎన్ఐటీకి రూ.54 కోట్లు. కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు. ఆదర్శ రైల్వే స్టేషన్ల జాబితాలో మార్కాపురం రోడ్డు, రాజమండ్రి, దొనకొండ, ఒంగోలు, ఆదోనిలు ఉన్నాయి. విశాఖ, బొబ్బిలి, పార్వతీపురం, విశాఖ, కడప, తిరుపతి, మచిలీపట్నం, విజయవాడ రైల్వే స్టేషన్లకు ప్రత్యేక అభివృద్ధి. రేణిగుంట, బేతంచర్ల, ధర్మవరం ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం. నల్లపాడు -గుంతకల్లు రైల్వే లైన్ విద్యుదీకరణకు రూ.150 కోట్లు. అరకు, సిమిలిగూడ ప్లాట్‌ఫాంల విస్తరణ. కోటిపల్లి-నర్సాపూర్ కొత్త రైల్వే లేన్‌కు రూ.430 కోట్లు. నడికూడి - శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్‌కు రూ.340 కోట్లు. కాజీపేట - విజయవాడ మూడో రైల్వే లైన్‌కు రూ.100 కోట్లు. విజయవాడ - సంభల్‌పూర్ మూడో రైల్వే లైనుకు రూ.90 కోట్లు. ఎస్ కోట, శివలింగాపురం, బొద్దవరం, బొర్రాగుహలు, పుల్లంపేట, ఇచ్చాపురం, సాలూరు, లక్కవరపుకోట, మార్కాపురం, పాకాల, నక్కలదొడ్డిల ఫ్లాట్ ఫాంల విస్తరణ.

టీడీపీ నేతల అనుమానం జైట్లీ ఏపీకి మళ్లీ మొండి చెయ్యి చూపించడంపై ఇలాంటి పరిస్థితుల్లో జైట్లీ బడ్జెట్ ఏపీకి ఊరటనివ్వలేదు. దీంతో చంద్రబాబు ఊహించని నిర్ణయం ఏమైనా తీసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఇటీవల మరోసారి ప్రతిపాదనల కోసం కేంద్రం ఏపీని అడిగింది. దీంతో ఏపీ ఆశలు పెట్టుకుంది. కానీ ఆ ఆశలు ఫలించలేదు.
  నవ్యాంధ్ర ప్రజలు నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ గురించి జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించకపోవడంపై టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే జోన్ కేటాయిస్తామని గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ఏమైందంటూ నేతలు ప్రశ్నిస్తున్నారు.

2018-19 సార్వత్రిక బడ్జెట్‌ ప్రధానాంశాలు:-
* గ్రామీణ వ్యవసాయ, విద్యారంగాలపై ప్రత్యేక దృష్టి
* ఈజ్ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో 43వ స్థానానికి చేరుకున్నాం
* పేద, మధ్యతరగతి వర్గాల ఆదాయాలు పెరుగుతున్నాయి
* ఉజ్వల, సౌభాగ్యయోజన పథకాల ప్రస్తావన
* పేదలకు ఉచిత డయాలసిస్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి
* గ్రూప్‌-సి, డి ఉద్యోగాలకు ఇంటర్వ్యూ లేకుండా చేశాం....లబ్ధిదారులకు ప్రయోజనాలు అందేలా అన్ని చర్యలు
* 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపునకు చర్యలు
* వ్యవసాయ ఉత్పత్తులు పెరిగి రైతులకు లాభాలు పెరగాలి
* వ్యవసాయం లాభసాటి వృత్తి కావాలి
* రబీలో మద్దతు ధర పెంచాం
* మార్కెట్‌ ధర ఎంఎస్‌పీ కన్నా తక్కువగా ఉంటే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
* 86 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే
* గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు
* గ్రామీణ మార్కెట్లలో 2వేల కోట్లతో మౌలికసదుపాయాల అభివృద్ధి
* ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన ఫేజ్‌-3 లో అన్ని వాతావరణాలను తట్టుకునేలా రోడ్లు నిర్మిస్తాం
* ఉద్యానవన పంటలపై ప్రత్యేక దృషి
* సేంద్రీయ వ్యవసాయంలో మహిళా రైతులకు పెద్దపీట
* కుటీర పరిశ్రమల్లో అత్తరు లాంటి ఉత్పత్తుల కోసం రూ.200 కోట్లు కేటాయింపు
* ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు రూ.1400 కోట్లు
* ఆలు, ఉల్లి ఉత్పత్తి పెంచేందుకు ఆపరేషన్‌ గ్రీన్
* 42 మెగా ఫుడ్‌ పార్కులలో అత్యాధునిక సౌకర్యాలు
* మత్స్య, పశుసంవర్ధక రంగాల వారికి కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు
* వెదురు ఉత్పత్తికి రూ.1290 కోట్లు
* మిగులు సౌర విద్యుత్‌ను కంపెనీలు కొనేలా చర్యలు
* మత్స్య‌, పశుసంవర్ధకశాఖల్లో రూ.10వేల కోట్ల నిధి
* వ్యవసాయ రుణాలు 11 లక్షల కోట్లకు పెంపు
* ఢిల్లీ పరిసరాలలో వాయు కాలుష్య నియంత్రణకు ప్రత్యేక పథకం
* రైతులు పంటలు తగలబెట్టకుండా చర్యలు
* ఉజ్వల యోజన కింద 8 కోట్ల మంది మహిళలకు గ్యాస్‌కనెక్షన్లు
* స్వచ్ఛభారత్‌ కింద 2 కోట్ల మరుగుదొడ్లు నిర్మించడమే లక్ష్యం
* పేదల గృహ వసతి కోసం 51 లక్షల ఇళ్ల నిర్మాణం
* 2017 నుంచి 1.02 కోట్ల ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నాం
* 96 వెనుకబడిన జిల్లాలో ప్రతి చేనుకు సాగు నీరు పథకం

Related Posts