విజయ్ దేవరకొండ.. టాలీవుడ్లో అతనిదో స్పెషల్ స్టైల్. అర్జున్‌రెడ్డితో అతని ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. హేమాహేమీలతో పోటీపడి ఫిల్మ్‌ఫేర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఆ అవార్డు అందుకున్న అనంతరం దాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తానని కూడా ప్రకటించాడు. వేలం వేసి వచ్చిన డబ్బులను నేరుగా అందిస్తానన్నాడు. అయితే ఆ అవార్డును వేలం వేసే పనిలేకుండానే.. దాన్ని సొంతం చేసుకుంది దివీస్ లాబరేటరీస్. రూ.25 లక్షల రూపాయలకు దాన్ని కొనుక్కుంది. ఆదివారం రౌడీస్ బ్రాండ్ లాంచింగ్ సందర్భంగా దివీస్ లాబరేటరీస్ అధినేత కిరణ్ దివి సతీమణి శకుంతల దివి దాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రూ.25 లక్షలు చెక్ అందించారు.