టెలికం రంగంలోకి ప్రవేశించి ప్రకంపనలు సృష్టించిన ముకేశ్ అంబానీ ఇటీవల ‘జియోఫోన్2’ను ఆవిష్కరించారు. దీంతో ఇండస్ట్రీలో మరోమారు గుబులు మొదలైంది. ముఖ్యంగా స్థానికంగా ఫోన్లు తయారీ చేసే చిన్న సంస్థల్లో వణుకు మొదలైంది. అయితే, తాజాగా జియోఫోన్2కు సంబంధించి మరొకొన్ని ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. ది మొబైల్ అసోసియేషన్ (టీఎంఏ)కి చెందిన మొబైల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ భూపేస్ రసీన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. జియోఫోన్ హ్యాండ్‌సెట్‌లు మేకిన్ ఇండియా కాదని పేర్కొన్నారు. తమకున్న సమాచారం ప్రకారం.. హ్యాండ్‌సెట్‌లను చైనా నుంచి దిగమతి చేసుకోనున్నట్టు తెలుస్తోందన్నారు. జియోఫోన్2.. 4జీ ఫీచర్‌ఫోన్‌ను రూ.501కే విక్రయిస్తే కనుక ఈ కంపెనీలన్నింటి కుదేలవడం ఖాయమన్నారు. ఇంటెక్స్, ఐటెల్, జివి మొబైల్స్, కార్బన్, లావా, మైక్రోమ్యాక్స్ వంటి కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు