విశాఖ జిల్లా అరకులోయ ప్రాంతాన్ని ముసురు వీడటం లేదు. గత నెల రోజులుగా మండల ప్రజలు సూర్య ధర్శనాన్ని మరచిపొయారు. కుండపోత వర్షం తో పాటు ఈదురు గాలులు అరకులోయ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వీడని ముసురు వలన ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ముఖ్యమైన పనులు వున్నప్పటికి బయటకు రావటం లేదు. దీనికి కారణం కూడ లేక పోలేదు. అరకులొయలో డెంగ్యూ, టైపాయిడ్,మలేరియా వంటి ప్రాణంతక వ్యాధులు ప్రబలడమే. ఇంకా ముసురు వీడక పోవడంతో అరకులోయ ప్రజలు ఇక్కట్లు పడుతూ సూర్య దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు, వీడని ముసురు వల్ల అరకులోయ ను సందర్శించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది.