YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలలో రెండు రోజుల పాటు వర్షాలు..!!

 బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలలో రెండు రోజుల పాటు వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజులలోను ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత నాలుగు రోజులుగా పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.  తీర ప్రాంతంలో గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా, పలు ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతాంగానికి ఈ వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పొలాల్లో విత్తనాలు మొలకెత్తే దశలో భారీగా చేరుతున్న నీటితో అవి కుళ్లిపోవచ్చన్న భయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.  సముద్ర తీరం వెంబడి మూడు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడే అవకాశాలు ఉన్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సలహా ఇచ్చింది.

Related Posts