టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వివాదం తేరా పైకి తెచ్చిన నటి శ్రీరెడ్డి రీసెంట్ గా తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ల పేర్లను ప్రస్తావిస్తూ ఉండటం అక్కడ చర్చలకు దారితీసింది. మురుగదాస్ .. లారెన్స్ .. శ్రీరామ్(శ్రీకాంత్)పై ఆమె ఆరోపణలు చేసింది. ఎవరిపై ఆమె ఆరోపణలు చేసిందో .. వాళ్లు స్పందించాలని టి.రాజేందర్ అనడంతో విషయం మరింత వేడెక్కింది. దాంతో శ్రీరెడ్డి విషయానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి రంగంలోకి దిగాలని విశాల్ నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. ఎవరిపై అయితే శ్రీరెడ్డి ఆరోపణలు చేసిందో .. వాళ్లతో మాట్లాడిన తరువాత ప్రెస్ మీట్ పెట్టాలని విశాల్ భావిస్తున్నాడట.