'ఐతే' .. 'అనుకోకుండా ఒకరోజు' .. 'మనమంతా' చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు చంద్రశేఖర్ యేలేటి. తాజాగా అయన లేడీ ఓరియెంటెడ్ కథను సిద్ధం చేసుకున్నారట. ఈ పాత్ర కోసం ఆయన అనుష్కను సంప్రదించి ఆమెను ఒప్పించినట్టుగా సమాచారం. ఈ సినిమాలో ఒక కీలకమైన అతిథి పాత్ర ఉందట. ఈ పాత్రను నాని చేస్తే బాగుటుందని భావించిన చంద్రశేఖర్ యేలేటి ఇటీవలే ఆయనను కలిశారని సమాచారం. పాత్రలోని కొత్తదనం నచ్చడం వలన నాని అంగీకరించాడని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు.