YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ట్రంప్, పుతిన్ ల భేటి...సత్సంబంధాలు పెంపొందుతాయ‌ని ఆశాభావం

ట్రంప్,  పుతిన్ ల భేటి...సత్సంబంధాలు పెంపొందుతాయ‌ని ఆశాభావం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఫిన్లాండ్‌లోని హెల్సింకిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2018 ఫిఫా వరల్డ్‌కప్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు పుతిన్‌ను ట్రంప్ అభినందించారు. ఇక తమ చారిత్రక భేటీలో ఏయే అంశాలపై మాట్లాడతామో ట్రంప్ వివరించారు. వాణిజ్యం, మిలిటరీ, మిస్సైల్స్, అణ్వాయుధాలు, చైనా.. ఇలా అన్నింటి గురించి మాట్లాడతామని స్పష్టంచేశారు. అమెరికా, రష్యా సంబంధాలపై కూడా స్పందించారు. కొన్నాళ్లుగా రెండు దేశాల మధ్య అంత మంచి సంబంధాలు లేవని ట్రంప్ అన్నారు. ఈ మధ్యే నేను రష్యా వచ్చాను. ఇప్పుడు పుతిన్‌తో మాట్లాడబోతున్నాను. రెండు దేశాలు సత్సంబంధాలు పెంపొందుతాయ‌ని ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రపంచమంతా అమెరికా, రష్యాలు కలిసి నడవాలని భావిస్తున్నాయి. ప్రపంచంలో ఈ రెండు దేశాలే అతిపెద్ద అణు శక్తి కేంద్రాలు. 90 శాతం అణ్వాయుధాలు మా దగ్గరే ఉన్నాయి. నిజానికి ఇది మంచి విషయం కాదు. చాలా చెడ్డ విషయం అని ట్రంప్ అన్నారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై పుతిన్‌తో మాట్లాడతారా లేదా అన్న అంశంపై ట్రంప్ స్పందించలేదు.

Related Posts