తిరుమల ఆలయంలో దర్శనాల నిలిపివేత అంశంపై విమర్శలు వస్తున్న వేళ, ఈ ఉదయం అధికారులతో పరిస్థితిని సమీక్షించిన చంద్రబాబు నాయుడు, పరిమిత సంఖ్యలో అయినా సరే భక్తులకు స్వామి దర్శనం చేయించాలని ఆదేశించారు. ఆగమ శాస్త్రం ప్రకారం జరిగే మహా సంప్రోక్షణ క్రతువుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా దర్శనాలకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ అధికారులకు ఆయన సూచించారు. గతంలో 1994, 2006 సంవత్సరాల్లో ఇదే క్రతువు జరిగినప్పుడు పాటించిన నిబంధనలనే ఇప్పుడూ పాటించాలని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు.