YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రతిదాంట్లో అవినీతి జరుగుతుంది - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

 ప్రతిదాంట్లో అవినీతి జరుగుతుంది - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెరాస ప్రభుత్వం వచ్చినప్పటినుంది ప్రతిదాంట్లో అవినీతి జరుగుతుందని కాంగ్రెస్ శాసనసభ పక్ష ఉప నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి   మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో అయన మాట్లాడుతూ.కేసీఆర్ కు సవాల్ పవర్ పేరుతో జరుగుతున్న అవినీతిని నిరూపిస్తా,నిరూపించక పోతే రాజినామచేసి  రాజకీయల నుండి తప్పుకుంటానని సవాల్ చేసార .సోలార పవర్్ టెండర్ కి సంబంధించి అధికారులు వద్దు అన్నా కూడా సీఎం కొన్ని కమిషన్  వాటాలు మాట్లాడుకుని ఒక చేశారన్నారు. సోలార్ పవర్ టెండర్ కి సంబంధించి 4000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు .అయిన కమీషన్ల కోసం బరితెగించిన ఈ ప్రభుత్వం  ప్రజలపై వేల కోట్ల భారం వేస్తుంది.ప్రపంచం లోని పెద్ద విద్యుత్ కంపెనీలను కాదని 20% తక్కువ ధరకు కోట్ చేసిన బీ హెచ్ ఈ ఎల్ కి ఇచ్చారు.దీని వల్ల ప్రజలపై 2000 వేల కోట్ల భారం పడనుంది/వారి కమీషన్ల కోసం 24 గంటల పవర్ పేరుతో దోపిడీ చేస్తున్నారు.అవినీతి బయటకి రాకుండా పేపర్లలో ప్రకటనలు ఇచ్చాడు.

పవర్ లేని పవర్ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి..

పవర్ లేని పవర్ మినిస్టర్ తో నాకవసరం లేదు. నాది తప్పు అని తేలితే నేను రాజకీయాలను వదులుకుంటానాని వెంకట రెడ్డి స్పష్టం చేసారు.యాదాద్రి పవర్ ప్లాంట్ లో స్కామ్ జరిగింది.

ఇకనైనా అవినీతిని అరికట్టే చర్యలు ఈ ప్రభుత్వం చేపట్టాలి.ఈ ప్రభుత్వం ప్రజాలపెరిట ఏ స్కీములు స్టార్ట్ చేసినా అందులో అవినీతి జరుగుతుంది.24గంటలు విద్యుత్ ఇవ్వడంలో మోసం దాగిఉంది.అవినీతి చేయను అనే అధికారులను ఈ ప్రభుత్వం బదిలీ చేస్తోంది.అవినీతికి అనుకూలంగా ఉన్న  అధికారులకు అందలం ఎక్కిస్తుంది ఈ ప్రభుత్వం. విద్యుత్ స్కామ్ పై చర్చకు ఎవరు వచ్చినా... ఎక్కడికి వచ్చినా  నేను సిద్ధం. స్పీకర్ కు నేరుగా నా రాజీనామా ఇస్తా.స్కామ్ పై ఓపెన్ గా సీఎం ఒప్పుకోవాలి.

స్కామ్ ను నేను ప్రూవ్ చేసేందుకు సిద్ధం.సీఎం స్కామ్ లేదని ప్రూవ్ చేసుకోవాలి.ఇకనైనా మోసం ఆపాలి.కరెంట్సీఎండీ  ప్రభాకర్ ని పంపండి చర్చకు సిద్ధ మన్నారు .

యాదాద్రి ప్లాంట్ నిర్మాణంలో 32వేల కోట్ల వర్క్ ను...నామినేషన్ పై ఇచ్చారు.దీనిపై విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా అనుమానాలు వ్యక్తంచేశారు.

ఇంత పెద్ద పనులను ప్రైవేట్ వాళ్లకు కాకుండా ప్రభుత్వ సంస్థలకు ఇవ్వాలన్నారు. బీహెచ్ఇఎల్ వాళ్ళు 50శాతం 16వేలకోట్ల పనులను మాత్రమే ఇచ్చారు. మిగిలినవి ప్రైవేట్ వాళ్లకు ఇచ్చారు.హడావుడిగా సోలార్ ప్రాజెక్టులను పిలిచారు.500ఎంవి వాట్స్ పిలిచారు. సీఎం వాటా చెప్పిన తర్వాత అధికారులు వద్దన్నా వాళ్ళనే సీఎం వాళ్ళనే పిలిచారని ఆరోపించారు.25 ఏళ్ళ వరకు ఒప్పందం చేసుకున్నారు...దీన్తో 4వేలకోట్ల నష్టం.యదాద్రి పవర్ ప్రాజెక్టుతో ప్రజల పై కోట్ల భారం పడుతుంది.జనవరి ఒకటో తేదీన 105 కోట్లతో పేపర్ ప్రకటనలు ఇచ్చారు.సోలార్ టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

Related Posts