YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైజాగ్ లో ఒంటరైనా గంటా

వైజాగ్ లో ఒంటరైనా గంటా
విశాఖ జిల్లాలో మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయంగా ఏకాకి అయ్యారా... మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులతో కళకళలాడిన గంటా శిబిరం ఇప్పుడు వెలవెలబోతుందా.. మెల్లగా ఒక్కొక్కరు జారుకున్న పరిస్థితి కనిపిస్తోందా.. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజకీయంగా ఉపయోగించుకోవడమే తప్ప ప్రత్యుపకారం చేయని కారణంగా అంతా గంటాను వీడి పోతున్నారని టాక్ నడుస్తోందట. తనని తాను రాజకీయ పెద్దగా అభివర్ణించుకునే గంటా శ్రీనివాసరావు ఇప్పుడు ఎవరూ లేని చోట వన్ మాన్ షో చేస్తున్నార ట. తనకంటూ బలం బలగం ఉందని ఇంకా చెప్పుకుంటూ పాలిటిక్స్ చేస్తున్నారట.వర్తమాన రాజకీయాలలో మిత్రులెవరూ శాశ్వతంగా ఉండరు. అలానే శత్రువులు ఉండరు. అవసరం కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరిగే వారంతా మిత్రులు అయిపోరు. జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావుకు ప్రస్తుతం ఇదే అనుభవం ఎదురవుతోంది. 2014 ఎన్నికల వరకు జిల్లాలో గంటా గ్యాంగ్ హవాబాగానే నడిచేది.ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ ఆ మీదట తెలుగుదేశం పార్టీలో ప్రవేశించినప్పుడు తనకంటూ ఓ బలగాన్ని తయారుచేసుకుని అధినాయకత్వం ముందు భారీగా ఫోకస్ ఇచ్చిన గంట కాలక్రమంలో అందరిని దూరం చేసుకున్నారని అనిపిస్తోంది. ఓవైపు తెలుగుదేశం పార్టీలో ప్రత్యర్ధి అయిన అయ్యన్న పాత్రుడు ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తున్న.. గంటా తన మందీ మార్బలాన్ని చూపించి హైకమాండ్ వద్ద పలుకుబడి పెంచుకున్నారాన్నది ఆరోపణ. 2014 సార్వత్రిక ఎన్నికలలో గంటా శ్రీనివాసరావుతో పాటు తన వారికి దండిగా టికెట్లు ఎంచుకున్నారు.ఆ విధంగా అనకాపల్లి ఎంపీగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎలమంచిలి నుంచి పంచకర్ల రమేష్ బాబు, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు వంటివారు టీడీపీలో చేరిపోయారు. ఇక గంటాను అనుసరించి ఎలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు, విశాఖ నగర మాజీ ఎమ్మెల్యే ఎస్. ఏ రెహమాన్ తదితరులంతా సైకిల్ ఎక్కేసారు. దశాబ్దాలుగా గంటాను అంటిపెట్టుకుని షాడో మంత్రిగా రాజ్యమేలిన సమీప బంధువు పరుచూరి భాస్కరరావు టీడీపీలో చురుకైన పాత్ర పోషించారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు వీరిలో ఎవరు గంటాతో అంటకాగి ఎందుకు సిద్ధంగా లేరట. ప్రజారాజ్యం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసి గంటా తోనే అంతా అనుకున్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు తన దారి తాను చూసుకుంటున్నారు. వచ్చే ఎన్నికలలో ఆయన భీమిలి నుంచి పోటీ చేయాలనుకుంటే గంటా తానూ తిరిగి అక్కడే పోటీ అంటూ ప్రకటించడంతో వీరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి అనుకుంటున్నారు. రైల్వే జోన్ సాధనకోసం గంటా శ్రీనివాసరావు అఖిలపక్ష మంటూ హడావిడి చేస్తే అనకాపల్లి ఎంపీ ఏకంగా రైల్వేస్టేషన్ వద్దనే దీక్ష పేరుతో హడావిడి చేశారు. దాంతో ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి అన్నది బహిర్గతమైంది.ఎలమంచిలి ఎమ్మెల్యేగా ఉన్న పంచకర్ల రమేష్బాబు టిడిపి రూరల్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ తనకంటూ సొంత రాజకీయ పంథాను రూపుదిద్దుకున్నారు. అలాగే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సైతం భవిష్యత్తు రాజకీయాలపై తనదైన ఆలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరంతా ఇప్పుడు గంటాను కాదని సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగడం మంత్రి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారని అంతా అనుకుంటున్నారు. ఇక మాజీలలో కన్నబాబురాజు వైసీపీ తీర్థం పుచ్చుకుని గంటాకు చెక్ చెప్పేశారు. మరో మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎ రెహమాన్ వచ్చేఎన్నికలలో వీటికోసం మైనార్టీ కార్డుతో ఏకంగా హైకమాండ్ తోనే టచ్ లో ఉంటున్నారు. పరుచూరి భాస్కరరావు అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ కి రెడీ అంటూ సొంత కుంపటి పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికలలో టిడిపి అధినాయకత్వం గంటా శ్రీనివాసరావు చెప్పే వారందరికీ టిక్కెట్లు ఇచ్చే వాతావరణం లేదన్నది ఓ కారణమైతే, నమ్మి చేరిన వారికి తగిన న్యాయం మంత్రిగా గంటా చేయలేక పోయారన్న ఆవేదనతోనే మిత్రులంతా తలోదారి పెట్టారన్నది మరో కారణంగా కనిపిస్తోంది. మొత్తానికి సుదీర్ఘ రాజకీయ పైనున్న గ్యాంగ్ విడిపోయి, గత ప్రతిష్ట మసకబారి గంటా ఒక్కరే మిగిలిపోవడం ఏ రాజకీయ పరిణామాలకు తెరతీయనుంది వేచి చూడాలి.

Related Posts