YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కేంద్రం ఏపీకి మొండి చేయి.

 కేంద్రం ఏపీకి మొండి చేయి.

-  కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిరాశ పరిచింది

- ఇది టీడీపీ వైఫల్యమే..

- రాజీనామాకు సిద్ధం 

- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయ సాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు

ఏపీకి ఆశించిన కేటాయింపులు లేకపోవడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయ సాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖ రైల్వే జోన్ మొదలు అన్నింటా కేంద్రం ఏపీకి మొండి చేయి చూపిందని విమర్శించారు. రైల్వే జోన్ లాభదాయం కాదని విశాఖ విషయంలో మొండిచేయి చూపారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. దీనిని బట్టి చూస్తుంటే దేశ ఆర్థిక బడ్జెట్ బాగా లేదని అర్థమవుతోందని విమర్శించారు. ప్రాఫిటబుల్ కాదని పక్కన పెట్టడం విడ్డూరమన్నారు.
ఏపీకి ఆశించిన మేర రాకపోడవంలో టీడీపీ వైఫల్యం ఉందని వైసీపీ ఎంపీలు అభిప్రాయపడ్డారు. తాము రాజీనామాలకు సిద్ధమని, కానీ తామే రాజీనామా చేస్తే ఏపీ గురించి ఎవరు అడుగుతారని మెలిక పెట్టడం గమనార్హం. కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిరాశ పరిచిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

అడిగేవారేరి...ఏపీకి ప్రత్యేక హోదా దక్కలేదని, ప్యాకేజీ ఆశించినట్లుగా లేదని మరి వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తారా అని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తమ అధినేత జగన్ ఎప్పుడు రాజీనామా చేయమంటే చేస్తామని చెప్పారు. కానీ మేం లేకుంటే కేంద్రాన్ని అడిగేవారు ఎవరని ప్రశ్నించారు. కాగా, తెలుగు రాష్ట్రాలు బడ్జెట్ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. కానీ నిరాశ ఎదురైంది. జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో అమరావతి, పోలవరం నిధుల ప్రస్తావన లేదు. అయితే ఏపీకి ఏ మేరకు ఇచ్చారని బడ్జెట్ ప్రతులు పూర్తిగా చదివితే తెలుస్తుంది.

 

Related Posts