మహా సంప్రోక్ష కార్యక్రమం సమయంలో శ్రీవారి దర్శనం నిలిపివేత్తపై టీటీడీ వెనక్కి తగ్గింది. ఆ ఐదు రోజుల పాటు రోజుకి 13 వేలమందికి దర్శనం కలిపించే అవకాశం వున్నట్టు సమాచారం. తిరుమల ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ భక్తులు సలహాల మేరకే ఎవరిని దర్శనానికి అనుమతించాలో 24వ తేదీన టీటీడీ పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సెలవు రోజులు కావడంతో ఎక్కువ మంది భక్తులు తరలివస్తే, భక్తులుకు ఇబ్బంది కలుగుతుంది. కోంత మంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసారు. భక్తులు మనోభావాలు దెబ్బతినకూండా నిర్ణయాలును పున:సమిక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 11వ తేదిన 9 గంటలు, 12వ తేదిన 4 గంటలు, 13వ తేదిన 4గంటలు, 14వ తేదిన 5గంటలు, 15వ తేదిన 5గంటలు, 16వ తేదిన 4గంటలు మాత్రమే భక్తులు దర్శనం కల్పించే అవకాశాలున్నట్లు అయన అన్నారు.