YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన

 రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన
ఉత్తర ఒరిస్సా దాని పరిసర ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం ఈరోజు ఉదయానికి  ఉత్తర ఛత్తీస్ గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో  కేంద్రీకృతమై ఉన్నది. దీనికి అనుబంధంగా 7.6 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. భూమి నుండి ఎత్తుకు వెళ్లే కొద్దీ ఇది నైఋతి వైపుకు ఒరిగివుంది. ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా జులై 21 వ తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఆదిలాబాద్, నిర్మల్,  కోమరంభీం, నిజామాబాద్  జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో   కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రేపు,  ఎల్లుండి  తెలంగాణ రాష్ట్రంలో   కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్ర లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రాగల మూడురోజులు కోస్తా ఆంధ్రలో  అక్కడక్కడ  కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోతేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు రాగల మూడురోజులు రాయలసీమలో  అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Related Posts