YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నిండు కుండలా తుంగభద్ర

నిండు కుండలా తుంగభద్ర
తుంగభద్ర జలాశయం నిండుకుండలా తొణికిసలాడుతోంది. జలాశయం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 76,527 క్యూసెక్కుల భారీ ఇన్‌ఫ్లోతో వరదనీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రస్తుతం జలాశయం 72 టీఎంసీల నీటిమట్టానికి చేరుకుంది. ఈక్రమంలోనే కాలువలకు నీళ్లు వదిలేందుకు ముహూర్తం ఖరారు చేసేందుకు సోమవారం తుంగభద్ర జలాశయం బోర్డు అధికారులు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రైతాంగానికి వరప్రదాయినిగా ఉన్న తుంగభద్ర జలాశయంలో  నాలుగేళ్ల నుంచి ఆశించిన స్థాయిలో నీళ్లు చేరకపోవడంతో మాగాణి భూములు బీళ్లుగా మారాయి. ఈసారి జిల్లాలో రైతులు ఆకాశం వైపు చూస్తుంటే.. కర్ణాటకలో మాత్రం వర్షాలు విస్తారంగా కురిశాయి. దీంతో తుంగభద్ర జలాశయానికి ఎన్నడూ లేని విధంగా 76, 527 క్యూసెక్కుల మేరవరద నీరు వచ్చి చేరుతోంది.140 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన తుంగభద్ర జలాశయంలో భారీగా పూడిక చేరింది. దీంతో జలాశయం సామర్థ్యం 100 టీఎంసీలకు పడిపోయింది. ఆదివారం నాటికి జలాశయంలోకి 72 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. అయితే భారీ ఇన్‌ఫ్లో ఉండడంతో బుధు, గురువారం నాటికి 100 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకునే అవకాశముందని హెచ్చెల్సీ అధికారులు భావిస్తున్నారు. దీంతో గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేసే అవకాశముందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కీలక సమావేశాన్ని టీబీబోర్డు నిర్వహిస్తోంది. 

Related Posts