అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ ఒక యాక్షన్ థ్రిల్లర్ ను రూపొందించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. కథాకథనాల పరంగా ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహ్మాన్ అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అందువలన ప్రస్తుతం ఏఆర్ రెహ్మాన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. గతం లో విక్రమ్ కుమార్ దర్శకత్వం లో వచ్చిన "24" చిత్రానికి రెహమాన్ సంగీతం అందించారు.