అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధిని స్వల్పశస్త్ర చికిత్సకోసం ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. బుధవారం తెల్లవారుజామున చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా కరుణానిధి గొంతు, శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చేరిన కరుణానిధిని చూసేందుకు ఆయన అభిమానులు కావేరీ ఆసుపత్రికి తరలివెళుతున్నారు.