YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కేంద్రాన్ని నిలదీయండి ఎంపీలతో సీఎం చంద్రబాబు

కేంద్రాన్ని నిలదీయండి ఎంపీలతో సీఎం చంద్రబాబు
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపధ్యంలో బుధవారం ఉదయం టిడిపి ఎంపిలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ కార్యక్రమం లో లోక్ సభ,రాజ్యసభ సభ్యులు,పార్టీ బాధ్యులు పాల్గోన్నారు. అఖిల పక్షం భేటిలో చర్చ సారాంశాన్ని ముఖ్యమంత్రి కి ఎంపీలు వివరించారు. తనతో మాజీ  ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జరిపిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి వివరించారు. చంద్రబాబు మాట్లాడుతూ తలుపులు మూసి ఏపికి అన్యాయం చేశారని ప్రధానే సభలో అన్నారు. జరిగిన అన్యాయాన్ని ఎందుకు చక్కదిద్దలేదని నిలదీయండని అన్నారు. ఎప్పటికప్పుడు ఢిల్లీ పరిణామాలను గమనిస్తుంటాను. ఒక లక్ష్యం కోసం మనం పోరాటం చేస్తున్నాం. మన కోసం మనం పోరాడుతున్నాం. రాష్ట్రం కోసం పోరాడుతున్నాం. భావి తరాల భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం. సస్పెండ్ చేస్తే చేయనివ్వండి. ఏ పరిణామానికైనా సిద్ధం కండి. పట్టుదలతో పోరాటం చేయండి. ఇతర పార్టీల మద్దతు కూడగట్టండి. కలిసివచ్చే పార్టీల సహకారం తీసుకోండి. యావత్ రాష్ట్రం మొత్తం ఢిల్లీవైపే చూస్తోందిని అన్నారు. పార్లమెంటు పైనే 5కోట్ల ప్రజల దృష్టివుంది. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీలేని పోరాటం  చేయండి. విభజన చట్టంలో అంశాల అమలుకు ఒత్తిడి చేయండి. ప్రధాని హామీలు నెరవేర్చాలని పోరాడండి, ఎందుకు అమలు చేయరని సభ సాక్షిగా నిలదీయండని అన్నారు. మనకు ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడే నిగ్గదీయండి. పోరాటం మనకు కొత్తేమీ కాదు. వాళ్ల అన్యాయం చక్కదిద్దుతామని బిజెపి చెప్పింది. ఇప్పుడు బిజెపి నేతలే అన్యాయం  చేస్తున్నారు. ఇది నమ్మిన వారిని మోసగించడం కాదా అని అన్నారు. ప్రజాకోర్టులో దోషులుగా నిలబెట్టండి.  ఏ పార్టీలు మనకు మద్దతు ఇస్తాయో ప్రజలే చూస్తారు. పోరాటం సమయంలో వైసిపి ఎంపిలు గోదా వదిలేశారు.  బైటకొచ్చి పోరాడుతున్నట్లు యాక్షన్ చేస్తున్నారు. వైసిపి పలాయన వాదానికి ఇదే నిదర్శనం.  వాళ్ల రాజీనామాలను  ప్రజలు పట్టించుకోవడం లేదు. వైసిపికి వాయిస్ లేకుండా పోయింది. దిక్కుతోచని స్థితిలో  వైసిపి పడింది.  వాళ్ల విశ్వసనీయత పోయిందని మన విశ్వసనీయత దెబ్బ తీయాలని చూస్తున్నారని అన్నారు.  ప్రత్యర్ధుల కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు అద్భుతంగా సహకరిస్తున్నారు. కేంద్రం సహకరించక పోవడం దుర్మార్గం. చట్టంలో అంశాలు,హామీలు నెరవేర్చక పోవడం దుర్మార్గం. రాజకీయ పార్టీలపై ప్రజల్లో విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోయే ప్రమాదం వచ్చింది.  ఎంపిలు సమన్వయంతో పనిచేయాలి. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. లాలూచి రాజకీయాలను ఎండగట్టాలి. సమాచారం ఇవ్వడానికి అధికార యంత్రాంగం సిద్దంగా ఉంది. ఎంపిలు దానిని సమర్ధంగా వినియోగించుకోవాలి. కేంద్రాన్ని ఈవిధంగా సవాల్ చేసిన రాష్ట్రం లేదని అన్నారు. 

Related Posts