ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ సీఎం చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ పెరిగిపోతోందా? గత రెండు నెలల నుంచి గమనిస్తే ఇది పీక్స్‌కి వెళ్లిపోయిందా? నవనిర్మాణ దీక్షల పేరుతో మొదలైన ఈ ప్రచార హంగామా.. రోజురోజుకూ మరింత ఉద్ధృతమవుతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది! అన్నింటికీ నిధుల సమస్య ఉందిగానీ.. ఈ ప్రచారానికి అడ్డే లేదా? అంటే మాత్రం మిలియన్ డాలర్ ప్రశ్నగానే మిగిలిపోతోంది. విభజన నాటి కష్టాలను గుర్తుచేసేందుకు నవ నిర్మాణ దీక్షలు, కేంద్రం చేసిన అన్యాయాన్ని నిలదీసేందుకు పోరాట దీక్ష, తర్వాత కేంద్రం, బీజేపీ నాయకులతో పాటు వైసీపీని విమర్శించేందుకు సమావేశాలు.. ఇలా రకరకాలుగా ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు.. ఇప్పుడు 1500 రోజుల పునరంకిత దీక్షలు అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. ప్రజా ధనంతో అత్యంత ఆర్భాటంగా..చేస్తున్న పబ్లిసిటీ అంతా ఈ దీక్షలతో పీక్స్‌కి చేరిందనే విమర్శలు వినిపిస్తున్నాయి!ప్రచారం అంటే ఆయనకు ఎంత ఇష్టమో ఇప్పటికే తెలిసే ఉంటుంది. 2014 ఎన్నికల ముందు.. తర్వాత ఇది పీక్స్‌కి చేరింది. అసలే ఎన్నికల సమయం అందులోనూ కొంత వ్యతిరేకత ఉందనే ఊహాగానాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిత్యం ప్రజల్లో ఉండేందుకు చంద్రబాబు ఇలా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారనే ఆరోపణలు జోరందుకున్నాయి. ప్రజల సొమ్ముతో బాబు ప్రచార పండుగలు చేసుకుంటున్నారనే వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ప్రచారం తర్వాత స్థాయికి చేరుతుందే తప్ప.. తగ్గే అవకాశాలే లేవని విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. ఇక వచ్చే సాధారణ ఎన్నికలు మరో ఏడెనిమిది నెలలు మాత్రమే ఉండడంతో చంద్రబాబు ఇంకా ఏ రేంజ్‌లో ప్రభుత్వ ధనాన్ని ప్రచారానికి వాడుతూ పబ్లిసిటీ స్టంట్ పీక్ స్టేజ్‌కు తీసుకు వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంనిధులా.. నీళ్లా అనేంతగా చంద్రబాబు ప్రచారం చేరిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీక్షలు, సభలు, సమావేశాలు, ఆందోళనలు.. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి నెలా ఉండేలా చేస్తున్నారు టీడీపీ నాయకులు. నాలుగేళ్లలో కేంద్రం చేసిన అన్యాయం.. అయినా వాటన్నింటినీ ఎదుర్కొని టీడీపీ ఎలా అభివృద్ధి చేస్తోందనే విషయాలను తన ఊకదంపుడు ఉపన్యాసాలతో చంద్రబాబు పదేపదే వివరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికారం చేపట్టి 1500 రోజులు పూర్తయిన సందర్భంగా పునరంకిత దీక్షలు చేపట్టారు. దీని కోసం పత్రికలు, టీవీల ప్రకటనలపై పెట్టిన ఖర్చు కూడా కోట్లలోనే. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తొలి వంద రోజులు.. ఏడాది పూర్తయిన తర్వాత వార్షికోత్సవాలు చేస్తూ హడావుడి చేస్తుంటారు. కానీ మరి చంద్రబాబు అందరికీ డిఫరెంట్ కదా!గత నెలలోనే తెలుగుదేశం సర్కారు నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుంది. అందుకే పునరంకిత సభలు కార్యక్రమాలు అంటూ ప్రజాధనంతో వారం రోజుల పాటు హంగామా చేసింది. రాష్ట్ర అవతరణ దినోత్సవాలను విస్మరించి జూన్ 2 నుంచి 8 వరకూ నవ నిర్మాణ కార్యక్రమాలు చేయటం ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నా.. చంద్రబాబు వాటినేమి పెద్దగా పట్టించుకోవటం లేదు. కానీ ఇఫ్పుడు కొత్తగా `1500 రోజుల ప్రగతి` పేరుతో పత్రికలకు పేజీలకు పేజీలు యాడ్స్ ఇచ్చి పండగ చేసుకుంటున్నారు. జూన్ లోనే వారం రోజుల పాటు ఈ నాలుగేళ్లలో తానేమి చేసింది చంద్రబాబు ప్రజలకు వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించి చెప్పేశారు. ఇది జరిగిన 40 రోజుల్లోనే రాష్ట్రంలో కొత్తగా చెప్పటానికి చంద్రబాబు సాధించింది ఏముంటుందోననే సందేహాలు వినిపిస్తున్నాయి!