గ్రామదర్శిని, గ్రామవికాసం కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు రాయదుర్గం పట్టణంలోని 1వ వార్డులో మంత్రి కాలవ శ్రీనివాసులు పర్యటించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి వార్డు పర్యటన ప్రారంభించిన మంత్రి వార్డులో డ్రైనేజీ నిర్మాణం పనులు పరిశీలించారు. ఎన్టీఆర్ పట్టణ గృహాల నిర్మాణాన్ని పరిశీలించి, లబ్దిదారులతో మాట్లాడారు. బిల్లుల చెల్లింపుపై కుడా లబ్దిదారులతో ఆరాతీసారు. శాంతినగర్లో జీన్స్ రెడీమేడ్ దుస్తుల తయారీ పరిశ్రమను సందర్శించి బాలకార్మికులను గుర్తించిన మంత్రి ఆ బాలలను తక్షణమే బడిలో చేర్పించి వారి సంరక్షణ బాధ్యతను ప్రభుత్వమే చేపట్టేలా చర్యలు చేపడతామని అన్నారు.