జమిలి ఎన్నికలనేది రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్య విరుద్ధమని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బీజేపీ, వైసీపీపై పత్రికా ప్రకటనలో యనమల ధ్వజమెత్తారు. కేంద్రం నిధులపై బిజెపి నేతలు శ్వేత పత్రం అడగటం హాస్యాస్పదం. కేంద్రం ఇచ్చింది, ఖర్చుచేసింది పారదర్శకం. ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతున్నామని అన్నారు. కేంద్రం నుండి రావాల్సినవాటి గురించి మాట్లాడండి. నాలుగేళ్లుగా ఏపికి ఇచ్చిందే అరకొర..పైగా వాటికి కూడా శ్వేతపత్రం కావాలంటారా అని అడిగారు. చట్టం ప్రకారం రావాల్సినవన్నీ ఇచ్చాక అప్పుడు అడగండి శ్వేతపత్రం. ఇచ్చిందేమో గోరంత, అడిగేదోమో శ్వేతపత్రం..ఇంతకన్నా విడ్డూరం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. బిజెపి నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రజల దృష్టి మళ్ళించాలని చూస్తున్నారు. రోడ్లు,ఇళ్లు,ఉపాధి నిధులు దేశం మొత్తం ఇచ్చారు. కామన్ కేటగిరి కింద ఏపికి ఎంత ఇచ్చారో కేంద్రాన్ని చెప్పమనండని అన్నారుజ ఏ కేటగిరి కింద ఎంత ఇచ్చారో కేంద్రాన్నే ప్రకటించమనండి. ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ కు ఎంత ఇచ్చారు? వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కు ఎంత ఇచ్చారు?రాజస్థాన్ పెట్రో కాంప్లెక్స్ కు ఎంత ఇచ్చారు..?కాకినాడ పెట్రోకాంప్లెక్స్ కు ఎంత ఇచ్చారు..? బుందేల్ ఖండ్ కు ఎంత ఇచ్చారు..? ఉత్తరాంధ్ర,సీమ జిల్లాలకు ఎంతఇచ్చారు..? ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన నిధులకు ఏపీకి ఇచ్చిన నిధులకు ఏమైనా పొంతన ఉందా..? డిఎంఐసికి,బుల్లెట్ ట్రైన్ కు ఇచ్చినదానికి, మనకు ఏమైనా ఫొంతన ఉందా..? బెంగళూరు,ముంబై రైల్వేలకు ఇచ్చిన దానికి, మనకు ఇచ్చిన దానికి పొంతన ఉందా..? బిజెపి రాష్ట్రాలకు నాలుగేళ్లుగా ఎంత ఇచ్చారు..? బిజేపియేతర రాష్ట్రాలకు ఎంత ఇచ్చారు..? అన్ని వివరాలు కేంద్రాన్ని వెల్లడించమనండని అన్నారు. విభజన చట్టం కింద ఇవ్వాల్సినవి మన రాష్ట్రానికే ప్రత్యేకం. వాటిని ఇతర రాష్ట్రాలతో పోల్చకూడదు అది ఆంధ్రప్రదేశ్ కే ప్రత్యేక చట్టం అని గుర్తుంచుకోవాలని అన్నారు. కామన్ కేటగిరిలో ఏపికి అన్యాయం చేశారు. ప్రత్యేక కేటగిరిలో కూడా ఏపికి అన్యాయమే చేశారని అయన అన్నారు. ఏ ముఖం పెట్టుకుని బిజెపి నేతలు శ్వేతపత్రం అడుగుతున్నారు..? ‘వన్ నేషన్-వన్ టాక్స్’ అనేది బిజెపి ముసుగు మాత్రమేనని అయన విమర్శించారు.