అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. కార్పొరేట్ వర్గాలను సంతృప్తిపరిచే అంశాలేవీ బడ్జెట్‌లో లేకపోవడంతో జైట్లీ బడ్జెట్ ప్రసంగ సమయంలో సూచీలు పతనమయ్యాయి. ఓ దశలో బీఎస్ఈ సెన్సెక్స్ 300 పాయింట్ల నష్టంతో 36 వేల పాయింట్ల దిగువున 35,501.74 పాయింట్లకు పడిపోయింది. అటు నిఫ్టీ కూడా 40 పాయింట్లకు పైగా నష్టపోయి 11 వేల పాయింట్ల దిగువునకు పడిపోయింది. ఆ తర్వాత పుంజుకున్న సూచీలు...నష్టాన్ని కొంత మేర భర్తీ చేసుకున్నాయి. సెన్సెక్స్ మళ్లీ 36 వేల పాయింట్ల ఎగువునకు పుంజుకుంది. కొద్ది సేపటి క్రితం సెన్సెక్స్ 74 పాయింట్ల లాభంతో 36,039 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా...నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 11,045 పాయింట్ల దగ్గర ట్రేడ్ కొనసాగిస్తోంది.