YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ సెల్ఫ్ గోల్

వైసీపీ సెల్ఫ్ గోల్
ఏపీలో ప్రతిపక్షపార్టీ రాజీనామాల డ్రామాలాడుతోందా..? ప్రత్యేక హోదా పేరు అడ్డంపెట్టుకుని వైసీపీ ఆడిన నాటకం కళ్లకు కట్టినట్టు కనపడుతోంది..?కేంద్రాన్ని నిలదీసే ధైర్యం లేక వైసీపీ నేత విజయసాయిరెడ్డి అనవసర విమర్శలు చేస్తున్నారని తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. విభజన హామీల అమలు కోసం పార్లమెంటు సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెట్టి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రజలను పక్కదారి పట్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. వర్షాకాల సమావేశాల్లో వైసీపీ పార్టిసిపేషన్ ఉండదు. గత సమావేశాల్లోనే ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు. రాజీనామాల వెనుక వైసీపీ స్ట్రాటజీని డిఫరెంట్. కావాలనే రాజీనామాలు చేసి పార్లమెంట్ సమావేశాలకు దూరంగా ఉండాలని ప్లాన్ చేశారని ప్రచారం సాగుతోంది. దీనివెనుక పెద్ద మతలబుందనే ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీకి వెన్నుదన్నుగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఎంపీల చేత ఆపార్టీ అధినేత జగన్ రాజీనామా చేయించారని వార్తలు వస్తున్నాయి. బడ్జెట్  పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ ఎంపీలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ప్రత్యేక హోదా కోరుతూ ఆందోళన చేశారు. సమావేశాల తర్వాత రాజీనామా చేశారు. అయితే ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేశామని ... పైగా టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర సమస్యలు పట్టవా.. ఎందుకు రాజీనామా చేయరంటూ ఎదురు దాడి చేశారు. అయితే తాము కూడా రాజీనామా చేస్తే ఇక పార్లమెంట్ లో పోరాడేది ఎవరని టీడీపీ సమాధానమిచ్చినా పట్టించుకోలేదు. అధికారంలో ఉంటూ అధికారాలను, హక్కులు సాధించుకోవాలని తాము చూస్తుంటే .. రాజీనామాతో ఎవరికి లాభమని టీడీపీ ప్రశ్నించినా దాటవేశారు.రాజీనామాలు చేస్తే .. పార్లమెంట్ లో రాష్ట్రసమస్యలపై మాట్లాడాలంటే సభలో ఉండాలికదా.. మరి రాజీనామాలు ఎందుకని ప్రశ్నించింది కూడా.  అయితే వైసీపీ ఎంపీల రాజీనామా వెనుక ఏదో మతలబు ఉందని మొదటినుంచి టీడీపీ చెబుతూ వస్తోంది. ప్రత్యేక హోదా పేరు అడ్డంపెట్టుకుని బీజేపీకి సపోర్ట్ చేసేందుకు నాటకాలు ఆడుతున్నారని టీడీపీనేతలు ఆరోపించినా.. బింకం ప్రదర్శించారు. బీజేపీకి తాము ఆమడదూరంలో ఉన్నామని .. మద్దతు తెలిపే ప్రసక్తే లేదని ప్రకటనలు చేస్తూ వచ్చింది. అయితే హడావుడిగా రాజీనామాలు చేయడం వెనక అసలు కారణం ఉందని టీడీపీ ఆరోపిస్తోందిపార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ అవిశ్వాస తీర్మానంపై చర్చకు కేంద్రం సిద్ధమైంది. అయితే కానీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామంటున్న వైసీపీ మాత్రం.. రాజీనామా బాట పట్టింది. మద్దతు ఇవ్వకుండా తప్పించుకునేందుకు రాజీనామా డ్రామా ఆడిందనేది అధికారపార్టీ ఆరోపణ. పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే తాము బేషరతుగా మద్దతు ఇస్తామని వైసీపీ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతోంది. అయితే హోదా ఇస్తామంటున్న కాంగ్రెస్ కు మాత్రం మద్దతు ఇవ్వదట. బీజేపీకి ఇస్తుందట. హోదా ఇవ్వనని తేల్చేసి.. చట్టరూపంలోని విభజన హామీలను నెరవేర్చేందుకు ముప్పుతిప్పలు పెడుతున్న కమలదళంపై విపక్షానికి బోల్డంత విశ్వాసం ఉందట. ఇలాగే అందర్నీ కన్ఫ్యూజన్ లో పడేస్తోంది వైసీపీ. ప్రధాని మోడీపై పార్టీలో వ్యతిరేకత పెరుగుతోందనే ప్రచారం ఉంది. టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడితే గెలుస్తాని ధీమా ఉన్నా.. బీజేపీ ఇరకాటంలో పడే అవకాశం ఉంది.  బీజేపీకి 274 సీట్లున్నాయి. వీరిలో స్పీకర్ , ఇద్దరు నామినేటెడ్ పర్సన్ ను తీసేస్తే సభ్యుల సంఖ్య 271కు చేరుతుంది. అవిశ్వాసం గెలిచేందుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 272. మోడీ వ్యతిరేకులైన కొందరు ఎంపీలు ఓటు వేస్తారా లేదాన్నది అనుమానమే. అయితే తాజాగా ఐదుగురు వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు. అంటే 543 ఎంపీల నుంచి ఐదుగురు వెళ్లిపోతే ఆ సంఖ్య 538కి చేరుతుంది. మెజార్టీ 269కి తగ్గుతుంది. అంటే వైసీపీ పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తునట్టు స్పష్టంగా తెలుస్తోంది. వైసీపీ ఎంపీల రాజీనామాలతో బీజేపీ లాభపడుతుందన్నది అందరికీ అర్ధమవుతోంది. ఎంతో లోతుగా ఆలోచించి వైసీపీ రాజీనామాలు చేసిందన్నది తేటతెల్లమవుతుంది. కమలానికి మద్దతు లేదని పైకి ఎన్ని మాటలు చెప్పినా.. చేస్తున్న పనులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్టు చెబుతున్నా .. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీకి ఇన్ డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తోంది. హోదాకోసం ఢిల్లీతో ఢీకొట్టేందుకు సిద్ధమైన టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడుతుంటే ..చల్లగా జారుకుందని ప్రచారం సాగుతోంది. అంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ ఎంపీలు పోరాడేందుకు ఏంలేదు. సభలో ఉంటేనే ప్రజాసమస్యల్ని వెల్లడించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ వర్షాకాల సమావేశాల్లో బీజేపీకి పరోక్షంగా మద్దతివ్వడమే వైసీపీ స్ట్రాటజీ. 

Related Posts