బిట్‌కాయిన్లతో సహా క్రిప్టో కరెన్సీలన్నీ చట్ట విరుద్ధైవెునవేనని, వాటి వినియోగాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అరుణ్ జైట్లీ గురువారం ప్రకటించారు. ‘‘క్రిప్టో కరెన్సీలను, కాయిన్‌లను ప్రభుత్వం చట్టబద్ధైవెునవిగా పరిగణించడం లేదు. క్రిప్టో ఆస్తుల ఉపయోగాన్ని నిర్మూలించడానికి అన్ని చర్యలు తీసుకుంటుంది’’ అని ఆయన లోక్ సభలో 2018-19 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ చెప్పారు. భారతదేశంలో వర్చువల్ కరెన్సీలను పాలించే నిబంధనలు ఏవీ లేవని, అటువంటి కరెన్సీలు నిర్వహించడానికి ఏ సంస్థ/కంపెనీకీ ఆర్.బి.ఐ. ఎటువంటి లైసెన్సూ మంజూరు చేయులేదని జైట్లీ గత ఏడాది పార్లమెంట్‌కు తెలియుజేశారు. వర్చువల్ కరెన్సీల పెరుగుతున్న వినియోగంపై అడపాదడపా వివిధ వేదికలపై వ్యక్తవువుతున్న ఆందోళనలను, నియంత్రణా పరంగా ఎదురవుతున్న సవాళ్ళను పరిగణనలోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఫైనాన్షియల్ సర్వీసుల శాఖ, దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆర్.బి.ఐ, నీతి ఆయోగ్, ఎస్.బి.ఐ, డి.ఇ.ఏలకు చెందిన ప్రతినిధులతో ఆర్థిక వ్యవహారాల శాఖ (డి.ఇ.ఏ) ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఆ కమిటీ నివేదికను సవుర్పించిందని, అది పరిశీలనలో ఉందని జైట్లీ గురువారంనాడు లోక్‌సభకు తెలిపారు.