మంగళవారం ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డే సందర్భంగా మ్యాచ్ ముగియగానే ఆటగాళ్లందరు మైదానాన్ని వీడుతున్న సమయంలో టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని.. అంపైర్లను అడిగి మరి బంతి తీసుకున్నాడు. ఈ సంఘటనతో ధోని క్రికెట్‌కు పూర్తి స్థాయిలో వీడ్కోలు పలికినట్లు తీవ్రస్థాయిలో ఊహాగానాలకు తెరలేచాయి. ధోని రిటైర్మెంట్ ఊహాగానాలకు భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి చెక్ పెట్టాడు. బుధవారం ఓ ప్రముఖ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ధోని రిటైర్మెంట్ వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ధోని ఎటూ వెళ్లటం లేదు.. టీమిండియాతో అతడు ఇంకొంత కాలం ఉంటాడు. బంతిని బౌలింగ్ కోచ్ చూపించడానికే తీసుకున్నాడు తప్పా ఏ రిటైర్మెంట్ ఉద్దేశం లేదు’ అంటూ రవిశాస్త్రి ‘ధోని-బంతి’ మిస్టరీపై వివరణ ఇచ్చారు.