ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాలపై ఈ ప్రభావం అధికంగా ఉండనుంది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. అల్పపడీన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని, అలల ఉధృతి పెరనుందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు.