YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక నడవా ఏర్పాటు ప్రక్రియ వేగవంతం సిఎస్ తో ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఉపాధ్యక్షులు భేటీ

 విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక నడవా ఏర్పాటు ప్రక్రియ వేగవంతం      సిఎస్ తో ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఉపాధ్యక్షులు భేటీ
విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక రహదారి  (విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్)(విసిఐసి)ప్రాజెక్టు ప్రగతిపై చర్చించేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఉపాధ్యక్షులు వెన్కాయ్ ఝాంగ్ గురువారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ తో భేటీ అయ్యారు.ఈసందర్భంగా విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ కు ప్రాజెక్టుకు సంబంధించిన పురోగతిపై వారు చర్చించారు. ముఖ్యంగా ఆసియా అభివృద్ధి బ్యాంకు విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవా ఏర్పాటుకు 5వేల 544 కోట్ల రూ.ల ఋణ సహాయం అందిస్తోంది.ఈకారిడార్ ఏర్పాటులో భాగంగా విశాఖపట్నం, మచిలీపట్నం,దొనకొండ,శ్రీకాళహస్తి-ఏర్పేడుల్లో నాలుగు పారిశ్రామిక క్లస్టర్ ప్రాంతాలను  ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించడం జరిగింది.దీనిలో భాగంగా మొదటి దశ కింద విశాఖపట్నం, శ్రీకాళగహస్తి-ఏర్పేడుల్లో పారిశ్రామిక ప్రాంతాలు,ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటుకు అవసరమైన మౌళికి సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇప్పటికే సుమారు 537 కోట్ల రూ.లను ఎడిబి విడుదల చేయగా విద్యుత్,నీటిసరఫరా తదితర మౌళిక సదుపాయాలను కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వివరించారు.ఈసందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ మాట్లాడుతూ విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక నడవా ఏర్పాటు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు వీలుగా ఎడిబి పూర్తి సహాయ సహకారాలను సకాలంలో అందించాలని విజ్ణప్తి చేశారు.ఈవిసిఐసిలో అభివృద్ధి చేసేందుకు గుర్తించిన నాలుగు ఇండస్ట్రియల్ క్లస్టర్లలో అవసరమైన మౌళిక సదుపాయాలను కల్పించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని ఆయా పనులు శరవేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు సిఎస్ స్పష్టం చేశారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు ఉపాధ్యక్షులు వెన్కాయ్ ఝాంగ్ మాట్లాడుతూ విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్లో పనుల పురోగతిని స్వయంగా తెల్సుకునేందుకు అధికారులుతో సమీక్షించేందుకు రెండు రోజుల పర్యటనలో భాగంగా తమ బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు చెన్నైలో కూడా పర్యటించడం జరుగుతోందని తెలిపారు.త్వరితగతిన విసిఐసి ఏర్పాటుకు వీలుగా ఎడిబి తరుపున అన్ని విధాలా తగిన తోడ్పాటును అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన సిఎస్ కు వివరించారు.

Related Posts