తెలుగుదేశం పార్టీ లో ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలో వై సీ పీ పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదని మంత్రి అమర్నాథ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఆదేశిస్తే పుంగనూరు నుంచి పోటీ చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు. బుధవారం పుంగనూరు లో జరిగిన సమావేశం లో పెద్ది రెడ్డి మంత్రి అమర నాథ రెడ్డి మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. వీటిపై మంత్రి అమర్ ఇవాళ తిరుపతిలో స్పందించారు. తాను రెండుసార్లు పుంగనూరు ఎమ్మెల్యే గా గెలిచానని, నియోజకవర్గం లో ప్రతి గడప తనకు పరిచయమే నన్నారు. తాను పలమనేరులో పోటీ చేయాలా, పుంగనూరు నుంచి బరి లోకి దిగల అని పెద్ది రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రాబోయే రోజుల్లో పుంగనూరు లో భారీ రాజకీయ మార్పులు ఉంటాయన్నారు.